NTV Telugu Site icon

BA.2.75: ఇండియాలో కొత్తగా ఓమిక్రాన్ సబ్ వేరియంట్ గుర్తింపు

Omocron Ba.2.75

Omocron Ba.2.75

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వేరియంట్ ఓమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ ను భారతదేశంలో కనుగొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ బుధవారం వెల్లడించారు. బీఏ.2.75గా పిలిచే ఈ వేరియంట్ భారత్ తో పాటు 10 దేశాల్లో కూడా గుర్తించారు. ఈ వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే కొత్తగా ఇండియాలో బయటపడిన వేరియంట్ గతంలో వచ్చిన వేరియంట్ల కన్నా తీవ్రంగా ఉందో లేదో ఇంకా నిర్థారించలేదు.

ప్రపంచ వ్యాప్తంగా గడిచిన రెండు వారాల్లో కేసుల సంఖ్య 30 శాతం పెరిగినట్లు టెడ్రోస్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసుల పెరుగుదలకు ఓమిక్రాన్ స్ట్రెయిన్ సబ్ వేరియంట్లు కారణం అని ఆయన అన్నారు. బీఏ.4. బీఏ.5 వేరియంట్లు యూరప్, యూఎస్ఏలో కోవిడ్ కేసులకు కారణం అవుతున్నాయి. ప్రస్తుతం భారత్ వంటి దేశాల్లో బీఏ.2.75 వేరియంట్ ను కనుగొన్నామని టెడ్రోస్ అన్నారు.

Read Also: Flexes in Hyderabad: సిలిండర్ ధర పెంపుపై హైదరాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు

గతంలో వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ల కన్నా బీఏ.2.75 వేరియంట్ భిన్నంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ వేరియంట్ టీకా ఇచ్చిన తర్వాత వ్యాధినిరోధక శక్తి నుంచి తప్పించుకోగలదా అని చెప్పడం తొందరపాటు అవుతుందని అన్నారు. అయితే ఈ వేరియంట్ స్పైక్ ప్రోటీన్ రిసెప్టర్ బైండిగ్ డొమైన్ పై కొన్ని ఉత్పరివర్తనాలు కలిగి ఉన్నట్లు వెల్లడించారు.

Show comments