Ram Mandir: దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తులు కోటి కళ్లలో రామ మందిరం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది 2024లో జనవరిలో ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ సారి శ్రీరామ నవమి వేడుకలు అయోధ్య రామ మందిరం సిద్ధం అవుతోంది. రామ నవమి వేడుకలు తాత్కాలిక ప్రాంగణంలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఆలయ నిర్మాణం పూర్తై, రామ మందిరంలోనే నవమి వేడుకలు జరగనున్నాయి.
సంక్రాతి నాటికి కాంక్రీట్ భవనం..
అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 2024 నాటికి రామ మందిర గ్రౌండ్ ఫ్లోర్ అంటే గర్భగుడిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది రామ నవమికి ముందు మకర సంక్రాంతి రోజున రాముడి విగ్రహాలను తాత్కాలిక ఆలయం నుంచి గర్భగుడిలోకి తీసుకెళ్లవచ్చు. రామాలయ ప్రవేశ మెట్లు, సింహద్వారం మొదటి ప్రవేశమార్గం ప్రస్తుతం పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపుగా సిద్ధం అయింది.
గర్భగుడికి 12 అడుగుల వెడల్పు తలుపులు..
గుడిలోని మండపం ద్వారాలు మక్రానా పాలరాతితో చేయబడింది. వీటికి అమర్చే తలుపులను దేశంలోనే అత్యంత నాణ్యమైన టేకు కర్రతో తయారు చేయబోతున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా బల్హార్షా నుంచి టేకు కర్రతో తలుపులు చేయనున్నారు. ఇక్కడి నుంచి భక్తులు రాముడిని దర్శించుకుంటారు. ప్రస్తుతం గర్భగుడిలో పాలరాతిని అమర్చే పనులు జరుగుతున్నాయి. ఈ గర్భగుడికి బంగారు తలుపులను ఏర్పాటు చేయనున్నారు. 9 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఈ తలుపులు ఉండబోతున్నాయి.
గర్భగుడిలోకి ముగ్గురికి మాత్రమే అనుమతి..
వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న రామ మందిరం గర్భగుడిలోకి ముగ్గురు మాత్రమే వెళ్లనున్నారు. అర్చకులు, రాష్ట్రపతి, ప్రధాని మంత్రి మాత్రమే గర్భగుడిలోకి వెళ్లేందుకు అనుమతినిస్తారు. సాధారణ భక్తులకు ఈ అవకాశం లేదు. రామాలయంలో రెండు ప్రదక్షిణ మార్గాలు నిర్మించబడుతున్నాయి. వీటిలో గర్భగుడి ఒక ప్రదక్షిణ మార్గం తయారువుతోంది. అర్చకులు మాత్రమే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయగలరు.
