Site icon NTV Telugu

Ram Mandir Event: రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన రాజకీయ నాయకులు వీరే..

India Bloc

India Bloc

Ram Mandir Event: జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ వేడుకలో రామ్ లల్లా(బాల రాముడి) ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ప్రధానితో పాటు దేశ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు, సాధువులతో సహా 7000 మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇండియా కూటమిలోని చాలా ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ అయోధ్య వేడుకలకు హాజరుకాబోవడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరిలు వేడుకలకు హాజరు కాబోవడం లేదని, అది బీజేపీ/ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలా ఉందని ఆరోపించింది.

రామ మందిర వేడుల ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రతిపక్ష నేతలు:

కాంగ్రెస్:
మల్లికార్జున్ ఖర్గే
సోనియా గాంధీ
అధిర్ రంజన్ చౌదరి
మన్మోహన్ సింగ్

తృణమూల్ కాంగ్రెస్:
మమతా బెనర్జీ

ఆమ్ ఆద్మీ పార్టీ:
అరవింద్ కేజ్రీవాల్

మహారాష్ట్రకు చెందిన శివసేన-(UBT):
ఉద్ధవ్ ఠాక్రే

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ):

శరద్ పవార్

నేషనల్ కాన్ఫరెన్స్:
ఫరూక్ అబ్దుల్లా

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్):
సీతారాం ఏచూరి

హజరయ్యే అవకాశం ఉన్న నేతలు:
హెచ్‌డీ దేవెగౌడ, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి.

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మొదట విహెచ్‌పి నుండి ఆహ్వానాన్ని తిరస్కరించారు, తనకు తెలియని వ్యక్తుల నుండి ఆహ్వానాన్ని అంగీకరించలేనని చెప్పారు. రాముడు ఎప్పుడు ఆహ్వానించాడో అలాగే రామమందిరాన్ని సందర్శిస్తానని యాదవ్ చెప్పారు. తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, సంప్రోక్షణ అనంతరం తన కుటుంబంతో కలిసి వస్తానని పేర్కొంటూ రామాలయ ట్రస్టుకు రాసిన లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Exit mobile version