Ram Mandir Features: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహం ఆలయ గర్భగుడికి చేరుకుంది. ఈ రోజు గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రతిష్ట తర్వాత బాల రాముడు వివిధ పూజలు చేయనున్నారు. జనవరి 22న అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రాణ ప్రతిష్ట జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది.
Read Also: Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డౌటే.. గోవాకు పర్యటనకు ఢిల్లీ సీఎం..
అయోధ్య రామాలయ ప్రత్యేకతలు:
* మందిరాన్ని సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు.
* మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు.
* మందిరం మూడు అంతస్తుల్ని కలిగి ఉంటుంది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి.
* ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడి చిన్ననాటి రూపం బాల రాముడి(రామ్ లల్లా) మొదటి అంతస్తులో ఉంటుంది. ఇక్కడే శ్రీరామ దర్బార్ కూడా ఉంది.
* నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలను ఆలయం కలిగి ఉంటుంది.
* గోడలు, స్తంభాలపై దేవీదేవతల విగ్రహాలు ఉంటాయి.
* తూర్పు ప్రవేశం, సింహద్వారం వద్ద 32 మెట్లు ఉంటాయి.
* వృద్ధులకు, వికలాంగులు గుడిలోకి వెళ్లేందుకు ర్యాంప్, లిఫ్ట్ సౌకర్యం ఉంది.
* పార్కోట (దీర్ఘచతురస్రాకార గోడ) 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో మందిర్ చుట్టూ ఉంది.
* మందిర నాలుగు మూలల వద్ద నాలుగు మందిరాలు- సూర్యదేవుడు, దేవీ భగవతి, గణేశుడు, శివుడి మందిరాలు ఉంటాయి. ఉత్తరంలో అన్నపూర్ణ మందిరం, దక్షిణంలో హనుమాన్ మందిరం ఉన్నాయి.
* మందిరం సమీపంలో పురాతన కాలంలోని చారిత్రత్మక భావి(సీతా కూప్) ఉంది.
* శ్రీ రామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్‌లో, మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, మాతా శబరి, దేవీ అహల్యలకు సంబంధించి ప్రతిపాదిత మందిరాలు ఉన్నాయి.
* ఆలయ కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేరుడి తిలా వద్ద భగవాన్ శివుడి పురాతన మందిరాన్ని, జటాయువు ప్రతిష్టాపనతో పునరుద్ధరించారు.
* ఈ మందిరంలో ఎక్కడా కూడా ఇనుము వాడలేదు.
* మందిర్ పునాది 14-మీటర్ల మందపాటి రోలర్-కాంపాక్ట్ కాంక్రీట్ (RCC)తో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిల రూపాన్ని ఇస్తుంది.
* నేలలోని తేమ నుంచి రక్షించేందుకు గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు.
* మందిరంలోని ప్రత్యేక బ్లాక్‌లో వాష్ రూమ్స్, వాష్ బేసిన్స్, ఓపెన్ ట్యాప్స్ మొదలైనవి ఉన్నాయి.
* ఈ మందిరం పూర్తిగా భారతీయ సాంప్రదాయ, స్వదేశీ టెక్నాలజీతో నిర్మించబడుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలోని మందిర కాంప్లెక్స్‌లో 70 శాతం పచ్చగా ఉండటంతో పాటు పర్యావరణ-నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ నిర్మించారు.