Site icon NTV Telugu

Ayodhya: అయోధ్య రాముడి కోసం బంగారు ధనుస్సు సిద్ధం

Gold Bow

Gold Bow

Ayodhya: అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిస్సా భక్తులు అత్యంత అరుదైన, అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 286 కిలోల బరువున్న భారీ ‘స్వర్ణ ధనుస్సు’ను అయోధ్యకు పంపించనున్నారు. ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుస్సును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో ఒక కిలో బంగారం, రెండున్నర కిలోల వెండితో పాటు రాగి, జింక్, , ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వాడారు. ఈ ధనుస్సు తయారీకి సుమారు కోటి 10 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.

ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ గ్యాంగ్‌లో ఊహించని ట్విస్ట్.. ఆ కీలక నటుడు అవుట్?

ఈ రామధనుస్సు సుమారు 8 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఎంతో గంభీరంగా చూడముచ్చటగా ఉంది. పూరీ జగన్నాథ స్వామి , అయోధ్య రాముడి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధానికి ప్రతీకగా, ఈ ధనుస్సుపై జగన్నాథుడి ప్రతిమను , ఫిలిగ్రీ కిరీటాన్ని అత్యంత నైపుణ్యంతో చెక్కారు. ఇది కేవలం ఒక ఆయుధంలా కాకుండా, ఒడిస్సా ప్రజల భక్తికి చిహ్నంగా నిలుస్తోంది.

సనాతన జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ ధనుస్సును ఒడిస్సాలోని వివిధ జిల్లాల గుండా ప్రయాణింపజేశారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ధనుస్సును దర్శించుకున్నారు. తొలుత పూరీ క్షేత్రానికి చేరుకున్న ఈ ధనుస్సుకు అక్కడ పవిత్ర క్రతువులు నిర్వహించారు. పూరీలో పూజల అనంతరం, ఈ స్వర్ణ ధనుస్సు శోభాయాత్రగా అయోధ్యకు బయలుదేరింది.

జనవరి 22న అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా (వార్షికోత్సవం), ఈ స్వర్ణ ధనుస్సును బాలరాముడి పాదాల చెంత భక్తిపూర్వకంగా సమర్పించనున్నారు. హిందువుల 500 ఏళ్ల కల నెరవేరిన వేళ, అయోధ్య మందిర నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో ఈ కానుక మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భారీ స్వర్ణ ధనుస్సు అయోధ్యకు చేరుకున్న తర్వాత, భక్తులకు మరో అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.

Vasant Panchami 2026 : చదువుల తల్లిని పూజించే వేళ.. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.!

Exit mobile version