Site icon NTV Telugu

Namaz: విద్యార్థులతో బలవంతంగా ‘‘నమాజ్’’ చేయించే యత్నం.. ప్రొఫెసర్ అరెస్ట్..

Namaz

Namaz

Namaz: ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) క్యాంపులోని విద్యార్థులతో ఓ ప్రొఫెసర్ బలవంతంగా నమాజ్ చేయించేందుకు ప్రయత్నించాడు. ఈ కేసుకు సంబంధించి గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో 8 మందిపై ఏప్రిల్ 26న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ప్రొఫెసర్ దిలీప్ ఝాను గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రష్మీత్ కౌర్ చావ్లా తెలిపారు.

దిలీప్ ఝాతో పాటు గురు ఘసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరంతా మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, రెచ్చగొట్టడం, మతపరమైన భావాలను దెబ్బతీయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Read Also: High Court: వివాహ “బంగారం” మహిళ ఆస్తి.. విడాకుల తర్వాత తిరిగి ఇవ్వాల్సిందే..

మార్చి 31న జిల్లాలోని కోటా పోలీస్ స్టేషన్ పరిధిలోని శవతరాయ్ గ్రామంలో మార్చి 26- ఏప్రిల్ 01 మధ్య ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితులు 159 మంది విద్యా్ర్థులతో నమాజ్ చేయించేందుకు బలవంతం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, మొత్త విద్యార్థుల్లో నలుగురు మాత్రమే ముస్లింలు అని అధికారులు గుర్తించారు. విద్యార్థులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. బిలాస్‌పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రజనేష్ సింగ్ ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి నగర పోలీసు సూపరింటెండెంట్ (కొత్వాలి) అక్షయ్ సబద్ర నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా, ఝా మరియు ఇతరులపై కేసు నమోదు చేయబడింది. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చావ్లా తెలిపారు.

Exit mobile version