Site icon NTV Telugu

CDS Anil Chauhan: మా దాడులు తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది..

Anil Chauhan

Anil Chauhan

CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్‌పై చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. ఫలితమే ప్రధానం అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనకు కొన్ని వారాల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్ పై విషం చిమ్మారు.. హిందువులపై వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే, ఆపరేషన్ సింధూర్ కొనసాగితే తట్టుకోలేమని భావించే పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ ఇకనైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదం పడగ కింద భారత్‌ ఎప్పటికీ ఉండబోదని వెల్లడించారు. న్యూక్లియర్ బ్లాక్‌ మెయిల్‌ను ఇండియా ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని సీడీఎస్‌ అనిల్ చౌహాన్ తెలిపారు.

Read Also: Tanuku: ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్ చేసేందుకు యత్నం.. కట్‌చేస్తే..

కాగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే పాకిస్తాన్‌ తన విధానంగా మార్చుకుందని సీడీఎస్ అనిల్ చౌహాన్ విమర్శించారు. కాల్పుల విమరణను ముందుగా పాక్ కోరిందని, కానీ నీరు రక్తం కలిసి పారవని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ తీరు మారాల్సిందే అన్నారు. ఇక, ఆపరేషన్‌ సింధూర్ సందర్భంగా చిన్న చిన్న నష్టాలు జరిగిన మాట నిజమే.. అయితే, ఈ నష్టాలు భారత సైన్యంపై పెద్దగా ప్రభావం చూపించవని సీడీఎస్‌ జనరల్‌ అనిల్ చౌహాన్ వెల్లడించారు.

Exit mobile version