NTV Telugu Site icon

PM Modi: జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా ఎంతో దూరంలో లేదు.. పీఎం మోడీ హామీ..

Pm Modi

Pm Modi

PM Modi: అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర హోదా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కోరుతున్న అంశాలు. ఈ అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రసంగించారు. గురువారం సాయంత్రం శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కాంప్లెక్స్(SKICC) వద్ద జరిగిన యువజన కార్యక్రమంలో ప్రసంగించిన PM మోడీ.. అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి, మీరు మీ ఓటుతో ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయం ఎంతో దూరం లేదని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా దాని భవిష్యత్తును స్వయంగా నిర్ణయంచుకునే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు.

Read Also: Maharashtra: బీజేపీ, షిండే వర్గం మధ్య వార్.. గత ఎన్నికల్లో బీజేపీ జోక్యంపై శివసేన సీనియర్ నేత ఫైర్

2019లో ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది. అప్పటి నుంచి అక్కడ ప్రజలు రాష్ట్ర హోదాను కోరుతున్నారు. పలు సందర్భాల్లో అమిత్ షా రాష్ట్రహోదాపై వాగ్దానం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభయ్యాయి. చివరిసారిగా 2014లో రాష్ట్రంగా ఉన్న సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి. సుప్రీంకోర్టు ఎన్నికలకు సెప్టెంబర్ గడువు విధించడంతో ఎన్నికల సన్నాహాలు వేగవంతమయ్యాయి.