నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ్టితో ముగిసాయి.. అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసిపోగా.. ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది విడతలుగా పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ నిర్వహించింది ఎన్నికల కమిషన్.. ఇవాళ బెంగాల్‌లో చివరి విడత పోలింగ్ ముగియగానే.. ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి జాతీయ ఛానెల్స్.. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ, షా, బీజేపీ అగ్రనాయత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసి కొట్టలా కనిపిస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి షాక్ తప్పదు అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.. అసోం మినహా ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి అధికారం దక్కే అవకాశాలు లేవంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.. ఇక, అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఓ ఎత్తు.. బెంగాల్ ఓ ఎత్తు అన్నట్టుగా ప్రచారం సాగినా.. అక్కడ కమలనాథుల ఆశలు నెరవేరయని.. మరోసారి దీదీయే సీఎం చైర్ ఎక్కడం ఖాయం అంటున్నాయి. మరోవైపు.. తమిళనాడులో డీఎంకే.. దాని మిత్రపక్షాలు క్లీన్ స్వీప్ చేయనుండగా.. ఎన్ని కుట్రలు చేసినా.. కేరళలో మరోసారి కామ్రేడ్లదే (ఎల్డీఎఫ్) అధికారం అని స్పష్టం చేస్తున్నాయి.
ఇక, సర్వే ఫలితాలు పరిశీలిస్తే.. ఏబీపీ న్యూస్ సీఓటర్, ఎన్డీటీవీ సర్వేలన్నీ పశ్చిమ బెంగాల్‌లో దీదీకే పట్టం కట్టాయి. మొత్తం 294 స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ 152-164 స్థానాల్లో విజయం సాధించనుండగా.. బీజేపీ 109-121 స్థానాలకే పరిమితం కానుంది.. వామపక్షాలు, ఇతరులు మరో 11-21 స్థానాలు గెలుచుకుంటారని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.. ఇక ఎన్డీటీవీ ప్రకారం.. టీఎంసీకి 156 స్థానాలు వస్తే.. రిపబ్లిక్-సీఎన్ఎక్స్ ప్రకారం 126-136 సీట్లు సాధించనుంది టీఎంసీ.. ఇక, బీజేపీ 138-148 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే, జన్‌కీ బాత్, రిపబ్లిక్ సీఎన్ఎక్స్ మాత్రం బీజేపీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టింది.
మరోవైపు.. అసోంలో భారతీయ జనతా పార్టీదే అధికారం అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.. ఎన్డీటీవీ ప్రకారం మొత్తం 126 స్థానాల్లో బీజేపీకి 76 స్థానాలు దక్కనుండగా.. ఇండియా టుడే, ఆజ్‌తక్-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ .. బీజేపీకి 75-85 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. ఇక, గోల్డ్ స్కామ్.. ఇతర విషయాల్లో కేరళలోని లెఫ్ట్ సర్కార్‌ను బ్లేమ్ చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసికొట్టినట్టే కనిపిస్తున్నాయి.. కేరళలో మరోసారి వామపక్ష కూటమిదే అధికారం అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.. ఇండియా టుడే.. కేరళలో మొత్తం 140 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ కూటమికి 104-120 స్థానాలు వస్తాయని అంచనా వేయగా.. ఎన్డీటీవీ మాత్రం ఎల్డీఎఫ్‌కు 76 స్థానాలుకు పరిమితం అవుతుందని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఎల్డీఎఫ్ తిరిగి అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశాయి.
మరో కీలకమైన రాష్ట్రం తమిళనాడులో అధికర పక్షానికి పెద్ద షాకే తగలబోతోంది.. సీఎం జయలలిత కన్నుమూసిన తర్వాత తొలిసారి ఎన్నికలను ఎదుర్కొన్న అన్నాడీఎంకే.. బీజేపీతో జట్టుకట్టినా ఉపయోగం లేకుండా పోయింది.. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అక్కడ అధికారం చేతులు మారి.. డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 234 స్థానాలు ఉన్న తమిళనాడులో డీఎంకేకు 160-170 స్థానాలు రానుండగా.. అన్నాడీఎంకే 58-68 స్థానాలకు పరిమితం కానుంది. అటు ఎన్డీటీవీ కూడా అన్నాడీఎంకేకు 58 స్థానాలకు మించి రావని తేల్చేసింది.. ఇక, రిపబ్లిక్ సీఎన్ఎక్స్, టుడేస్ చాణక్య, పీ-మార్క్ ఇలా అన్నీ సర్వేలు డీఎంకే కూటమిదే అధికారం అంటున్నాయి.. మరోవైపు 30 అసెంబ్లీ స్థానాలున్న కేంద్రపాలిత ప్రాంతమైన పుద్దుచ్చేరిలో ఎన్నికలకు ముందే.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోగా.. ఈ సారి బీజేపీ అధికార పగ్గాలు అందుకోనుంది.. మొత్తంగా ఎన్డీఏ 20కి పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని, యూపీఏ 8 స్థానలకే పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తంగా.. ఈ సారి రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించబోతోంది అంటున్నాయి సర్వేలు. మరి తుది ఫలితాలు ఎలాబోతున్నాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.