NTV Telugu Site icon

Assam: మిలిటెంట్ గ్రూప్ బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్

Assombombs

Assombombs

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ మిలిటెంట్ గ్రూప్ బాంబు బెదిరింపులకు దిగింది. అస్సాంలో 19 చోట్లు బాంబులు పెట్టినట్లుగా నిషేధిత తిరుగుబాటు గ్రూపు ఉల్ఫా-ఐ బెదిరించింది. మిలిటెంట్ గ్రూప్ బెదిరింపులతో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. అణువణువూ ఆయా ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఈ తనిఖీల్లో పలు ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులను గుర్తించారు. అస్సాంలోని శివసాగర్, దిబ్రూగఢ్, గౌహతి, అలాగే దిగువ అస్సాం వంటి అనేక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు ఒక ప్రకటనలో ఉల్ఫా-ఐ సంస్థ పేర్కొంది. శివసాగర్, నాగోన్‌తో సహా పలు ప్రాంతాల నుంచి అనుమానాస్పద వస్తువులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Himanta Biswa Sarma: తగ్గుతున్న హిందూ జనాభా.. అస్సాం భవిష్యత్తు ప్రమాదంలో ఉంది..

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిపి తమ సత్తాను చాటుకోవాలని ఉగ్రసంస్థ తమ ప్రకటనలో పేర్కొంది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఉల్ఫా ఆపరేషన్‌ను విరమించుకుంది. పేలుడు పదార్ధాలు సాధారణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా వాటిని రికవరీ చేసి నిర్వీర్యం చేయాలని అభ్యర్థించింది.

ఉల్ఫా జాబితా ఇదే: DTO ఆఫీస్, ONGC నంబర్ 5 గేట్, దిబ్రూఘర్ లకువా తినాలి, ASTC, లఖింపూర్ ASTC, SP ఆఫీస్, లాలుక్ డైలీ మార్కెట్, బర్ఘాట్ పోలీస్ అవుట్‌పోస్ట్, నంగావ్ మెడికల్ కాలేజ్, గౌహతి దిస్పూర్ లాస్ట్ గేట్, గాంధీ మండప్, నరేంగి ఆర్మీ క్యాంప్ , అస్సాంలోని శివసాగర్ జిల్లాలో పాన్ బజార్, జోరాబత్ ఓవర్‌బ్రిడ్జ్, భేటపరా, మాలిగావ్, రాజ్‌గఢ్, నల్బారి మరియు రంగియా. టిన్సుకియా జిల్లాలోని మూడు చోట్ల, దిబ్రూగఢ్ జిల్లాలో ఒక చోట, గోలాఘాట్ మరియు సోరుపత్తర్‌లో ఒక్కో ప్రదేశంతో సహా మూడు చోట్ల బాంబులు అమర్చినట్లు ఉల్ఫా తెలిపింది.

ఇది కూడా చదవండి: Ward Boy: వైద్యుడికి బదులు వార్డ్బాయ్ ఆపరేషన్.. వీడియో తీసి..!

Show comments