స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ మిలిటెంట్ గ్రూప్ బాంబు బెదిరింపులకు దిగింది. అస్సాంలో 19 చోట్లు బాంబులు పెట్టినట్లుగా నిషేధిత తిరుగుబాటు గ్రూపు ఉల్ఫా-ఐ బెదిరించింది. మిలిటెంట్ గ్రూప్ బెదిరింపులతో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి.