Site icon NTV Telugu

Assam: అస్సాంను ముంచెత్తిన వరదలు.. 132 ఏళ్ల రికార్డ్ బద్ధలు

Assamrain

Assamrain

అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు దంచికొట్టాయి. దీంతో 132 ఏళ్ల రికార్డ్ బద్ధలైంది. వాగులు, వంకలు అన్ని ఏకమయ్యాయి. ఇళ్లు, రహదారులు నీట మునిగాయి. అస్సాంలో రెండవ అతిపెద్ద నగరమైన సిల్చార్‌లో 24 గంటల్లో 415 మి.మీ వర్షపాతం నమోదైంది. 1893 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. అంటే జూన్ 1న 132 ఏళ్ల తర్వాత అతి పెద్ద వర్షపాతం నమోదైంది. 1893లో 290.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అటు తర్వాత అంతకు మించిన వర్షం ఆదివారం కురిసింది.

ఇది కూడా చదవండి: US: అమెరికాలో ఫైర్ బాంబ్ దాడి.. పలువురికి గాయాలు.. నిందితుడు పాలస్తీనా నినాదాలు

ద్రోణి కారణంగా అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆయా రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. ఇక 2022లో బేత్కుండి దగ్గర బరాక్ నదిపై వాగు తెగిపోవడంతో సిల్చార్ నగరం వరదలను ఎదుర్కొంది. 90 శాతం పట్టణం మునిగిపోయింది. తాజాగా జూన్ 1న కురిసిన వర్షానికి మరోసారి మునిగిపోయింది.

ఇది కూడా చదవండి: Uppal: అర్ధరాత్రి రోడ్లపై జన్మదిన వేడుకలు.. బుద్ధి చెప్పిన పోలీసులు

గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ఇక కొండచరియలు విరిగిపడడంతో 34 మంది చనిపోయారు. మే 31న మిజోరాంలో సాధారణం కంటే 1,102 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక మే 28 నుంచి జూన్ 1 వరకు గత ఐదు రోజులుగా మేఘాలయ అంతటా భారీ వర్షాలు కురిశాయి.

Exit mobile version