Site icon NTV Telugu

Polygaymy: అస్సాం సీఎం సంచలన నిర్ణయం.. “బహుభార్యత్వం” నిషేధం వైపు అడుగులు

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Assam looking to ban Polygaymy: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, మతమార్పిడులు, బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపుతున్న ఆయన ఇప్పుడు ‘‘బహుభార్యత్వం’’ నిషేధించాని చూస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో బహుభార్యత్వంపై నిషేధించడం విధించడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. న్యాయపరమైన అంశాలను అన్వేషించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read Also: Imran Khan: పాకిస్తాన్ వ్యాప్తంగా 121 కేసులు.. ఇమ్రాన్ ఖాన్ అరెస్టైన కేసు ఏంటంటే..?

ఈ నిర్ణయం ద్వారా అస్సాం ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో బహూభార్యత్వాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందా.?? లేదా?? అనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25తో చదివిన ముస్లిం పర్సనల్ లా (షరియత్) చట్టం, 1937లోని నిబంధనలను పరిశీలిస్తుంది ముఖ్యమంత్రి ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. కమిటీ న్యాయనిపుణులు, అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చిస్తుందని ఆయన వెల్లడించారు.

ముస్లింలలో బహుభార్యత్వం మరియు ‘నికాహ్ హలాలా’ ఆచారం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిన కొన్ని నెలల తర్వాత అస్సాం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ వేసిన పిల్ పై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.

Exit mobile version