NTV Telugu Site icon

Himanta Biswa Sarma: ఈశాన్య భారతాన్ని కాంగ్రెస్ అమ్మేసినట్లుంది..

Himanta Biswa Sarma.

Himanta Biswa Sarma.

Himanta Biswa Sarma: కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై మరోసారి అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ విరుచుకుపడ్డారు. తాజాగా కాంగ్రెస్ చేసిన ఓ ట్వీట్ వివాదానికి కారణమైంది. ఆ ట్వీట్ లో భారతదేశం మ్యాపులో ఈశాన్య రాష్ట్రాలు లేకపోవడంపై హిమంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ వేరు చేసిందని అన్నారు. ఈ ఉదంతంపై ఆయన ఎక్స్(ట్విట్టర్)లో కాంగ్రెస్ ను విమర్శించారు. ‘‘ఈశాన్య రాష్ట్రాల భూమిని ఏదో పొరుగుదేశానికి విక్రయించేందుకు కాంగ్రెస్ పార్టీ రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు కనిపిస్తోంది. దీని కోసమే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారా..? లేకపోతే షర్జీల్ ఇమామ్ కి పార్టీ సభ్యత్వం ఇచ్చిందా..?’’ అని ప్రశ్నించారు.

Read Also: Rajeev Chandrasekhar: “భారత్‌తో యుద్ధానికి దిగితే మీ పిల్లల్ని వేరే వాళ్లు పెంచుతారు”.. కేంద్రమంత్రి మాస్ వార్నింగ్..

శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో మోడీని ఎగతాళి చేసింది. రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ కార్టూన్లతో పాటు వెనకాల భారతదేశ మ్యాపు ఉంటుంది. ఈ మ్యాపులో ఈశాన్య రాష్ట్రాలు మిస్ అయ్యాయి. దీనిపై హిమంత బిశ్వసర్మ విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ఈశాన్య ప్రాంతాలను చైనాకు ఇచ్చినట్లు నాకు అనిపిస్తోంది. ఈశాన్య ప్రాంతాలు లేకుండా భారతదేశ మ్యాపును చూపిస్తున్నారని, ఇది దేశానికి వ్యతిరేకం, ఈశాన్య ప్రాంత ప్రజలు, దేశ ప్రజలు దీన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ది చెప్పాలని ఆయన కోరారు.

హిమంత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అస్సా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. సీఎం హిమంత బిస్వ సర్మ భూ ఒప్పందాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని, తన కుటుంబానికి కట్టబెట్టిన భూములపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.