దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భద్రతా లోపం కనిపించింది. బుధవారం ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాసంలో ఒక జంతు ప్రేమికుడు అత్యంత దారుణంగా దాడి చేయడంతో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనబడింది. తాజాగా పార్లమెంట్ దగ్గర మరోసారి భద్రతా లోపం వెలుగు చూసింది.
ఇది కూడా చదవండి: Uttarakhand: దారుణం.. క్లాస్ రూమ్‌లో తిట్టాడని టీచర్‌ను కాల్పులు జరిపిన 9వ తరగతి విద్యార్థి
శుక్రవారం ఉదయం 6:30 గంటలకు పార్లమెంట్ నూతన భవనంలోకి ఒక దుండగుడు గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. రైల్ భవన్ వైపు నుంచి చెట్టు మీదకు ఎక్కి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. అనంతరం గరుడ గేటు దగ్గరకు చేరుకున్నాడు. భద్రతా సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో దారుణం.. పెళ్లి ఒత్తిడి తేవడంతో మహిళను ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు
చొరబాటుదారుడిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారని.. అతడిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది కూడా ఇలాంటి భద్రతా ఉల్లంఘనే జరిగింది. 20 ఏళ్ల యువకుడు పార్లమెంట్ గోడ దూకి అనెక్స్ భవనం ఆవరణలోకి వెళ్లాడు. షార్ట్స్, టీ-షర్ట్ ధరించిన నిందితుడిని భద్రతా దళాలు పట్టుకున్నాయి. కానీ అతడి దగ్గర ఎలాంటి ఆయుధాలు కనిపించలేదు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరగడంతో భద్రతా లోపాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: US: రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ఢిల్లీనే ఆజ్యం పోస్తోంది.. అమెరికా వాణిజ్య సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు
ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారమే ముగిశాయి. జూలై 21న ప్రారంభమైన సమావేశాలు.. ఆగస్టు 21న ముగిశాయి. ఏ రోజు సభ సజావుగా సాగలేదు. నిత్యం అంతరాయాలు కలుగుతూనే ఉన్నాయి. కేవలం 37 గంటల 7 నిమిషాలుు మాత్రమే సభ సక్రమంగా జరిగింది. మిగతా సమయం అంతా వృధా అయింది.
