Site icon NTV Telugu

Bollywood Actor: పండగ పూట విషాదం.. ప్రముఖ హస్య నటుడు మృతి

Untitled Design

Untitled Design

Anasuya : ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూశా.. అనసూయ పోస్టుపండుగపూట సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హస్యనటుడు గోవర్ధన్ అస్రాని చనిపోయారు. చాలా ఏళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతూ.. పండగ రోజు ఆయన మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Read Also: Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం

పూర్తి వివరాల్లోకి వెళితే..ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం తుదిశ్వాస విడించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు నిర్ధారించారు. గోవర్ధన్ అస్రాని 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించారు. కమెడియన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా హిందీ సినిమాల్లో రాణించారు. మేరే అప్నే, కోషిష్, బావర్చీ, పరిచయ్, అభిమాన్, చుప్కే చుప్కే, చోటీ కీ బాత్ లాంటి మూవీల్లో నటించారు. బ్లాక్బస్టర్ ‘షోలే’లో పోలీసు ఆఫీసర్గా కనిపించారు. ఆయన మరణవార్త తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుసుకున్నారు. అస్రాని కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు.

అస్రాని 350 కి పైగా చిత్రాలలో నటించాడు. అతని శిఖరాగ్ర కాలం 1970లలో, అతను అత్యంత విశ్వసనీయ మరియు ప్రజాదరణ పొందిన పాత్ర నటులలో ఒకరిగా పేరుగాంచాడు. అతను “మేరే అప్నే,” “కోషిష్,” “బావర్చి,” “పరిచాయ్,” “అభిమాన్,” “చుప్కే చుప్కే,” “చోటీ సి బాత్,” మరియు “రఫూ చక్కర్” వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. నటనతో పాటు, అస్రానీ అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి కథలు రాశారు. ఆయన “చల్ మురారి హీరో బన్నే” మరియు “సలాం మేమ్సాబ్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. గుజరాతీ సినిమాల్లో కూడా ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు. ఇటీవల, ఆయన “ధమాల్” వంటి హాస్య చిత్రాలలో పనిచేశారు. ఆయన మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Exit mobile version