Anasuya : యాంకర్ అనసూయ ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంది ఈ బ్యూటీ. నేను చిన్నప్పుడు దీపావళిని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే దాన్ని. ఉదయాన్నే మంగళహారతి తర్వాత మా నాన్న ఇచ్చే పాకెట్ మనీ డబ్బుల కోసం నేను, మా సిస్టర్స్ వెయిట్ చేసేవాళ్లం. ఆ తర్వాత మా అమ్మ చేసే పిండివంటలు ఇంటిలో వాసనలు వెదజల్లేవి.
Read Also : Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 మరో రికార్డు..
కానీ పండగ పూట మా పేరెంట్స్ పెద్దగా ఎంజాయ్ చేసేవారు కాదు. మా అమ్మ మాకు అన్నీ ఇచ్చేసి తాను కొంత దిగులుగా కనిపించేది. మా అమ్మ అలా ఎందుకు ఉండేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక తల్లిగా పిల్లలకు అన్నీ ఇవ్వడంలో ఎంతో సంతోషం ఉంది. అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు నా పిల్లలకు నేను ఆ విషయంలో లోటు రాకుండా చూసుకుంటున్నాను. ఈ రోజు దీపావళి సందర్భంగా అన్నీ చేశాను. అందుకే చాలా అలసిపోయాను. కానీ చాలా సంతృప్తిగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.
Read Also : Rashmika : బ్రేకప్ అయితే అమ్మాయిలు తట్టుకోలేరు.. రష్మిక కామెంట్స్