భర్త రెండో పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో రగిలిపోతున్న మొదటి భార్య చేసిన పనికి ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. బీహార్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుపౌల్బాజార్కు ఖుర్షీద్ ఆలం అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం బీబీ పర్వీన్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.. అయితే, ఎంతకీ వారికి సంతానం కలగకపోవడంతో.. పిల్లల కోసం రెండు సంవత్సరాల క్రితం రోష్మి ఖతూన్ అనే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు ఖుర్షీద్. ఇది గిట్టని మొదటి భార్య ఎప్పుడూ బెదిరిస్తూ వచ్చేది.. కానీ, ఆ గొడవ కాస్తా తారాస్థాయికి చేరింది.. ఇవాళ ఉదయం పెట్రోల్ పోసి ఇంటికే నిప్పటించింది.
Read Also: Xi Jinping: కరోనా విలయం.. జిన్‌పింగ్‌కు పదవి గండం..!?
శనివారం తెల్లవారు జామున 5 గంటలకు పెట్రోల్ పోసి ఇంటికి నిప్పటించింది మొదటి భార్య పర్వీన్. ఈ ఘటనలో పర్వీన్ కూడా సజీవదహనమైంది.. ఆమెతో పాటు అత్త రుఫైదా ఖతూన్ కాలిపోయింది.. ఇక, రెండో భార్య రోష్మి ఖతూన్, భర్త ఖుర్షీద్ మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యారు.. వారిని మొదట సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు.. ఆ తర్వాత ధర్భంగా ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.. చికిత్స పొందుతూ ఆ ఇద్దరు కూడా కన్నుమూశారు.. మొత్తంగా భర్త రెండో పెళ్లి.. ఆ కుటుంబంలోని నలుగురి ప్రాణాలు తీసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.