Site icon NTV Telugu

Karnataka: జర్మన్ ఛాన్సలర్ కంటే రాహుల్ గాంధీ ఎక్కువైపోయారా? కాంగ్రెస్‌పై బీజేపీ ధ్వజం

Congressbjp

Congressbjp

కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ  రగడ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాషాయ పార్టీ తీవ్రంగా ఖండించింది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం కర్ణాటకకు వచ్చారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మెర్జ్ ల్యాండ్ అయ్యారు. ఆయనకు కర్ణాటక పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్.. సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి: Trump: నిరసనకారుల్ని ఉరి తీస్తే కఠిన చర్యలుంటాయి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్

మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన కోసం మైసూర్‌లో ల్యాండ్ అయ్యారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌తో పాటు మంత్రులు వెళ్లారు. ఈ వ్యవహారమే ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇది కూడా చదవండి: Anil Ravipudi: నిర్మాతకు కారు.. నాకు విల్లా: అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్!

జర్మన్ ఛాన్సలర్ కంటే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ ఎక్కువైపోయారా? అంటూ బీజేపీ ప్రశ్నించింది. . రాష్ట్ర అభివృద్ధి కంటే.. కాంగ్రెస్ హైకమాండ్‌ను సంతృప్తి పరిచేందుకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించింది. రాహుల్ గాంధీని మైసూరు విమానాశ్రయంలో ప్రభుత్వ పెద్దలు స్వాగతించడం.. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ను బెంగళూరు విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి ఒక మంత్రిని నియమించడంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక ఎక్స్‌లో తప్పుపట్టారు.

‘‘ఈరోజు జర్మన్ ఫెడరల్ ఛాన్సలర్ కర్ణాటకను సందర్శించారు. ఇది మన రాష్ట్రానికి అపారమైన దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన క్షణం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి ఎవరైనా సరే తగినంత గౌరవం ఇచ్చేవారు. కర్ణాటకకు పెట్టుబడి, పరిశ్రమ, ఉపాధి, దీర్ఘకాలిక వృద్ధికి మంచి అవకాశం.’’ అని అశోక రాశారు. ‘‘కానీ ఈరోజు పరిస్థితి చూడండి… జర్మన్ ఛాన్సలర్ బెంగళూరులో అడుగుపెట్టినప్పుడు.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఊటీకి ప్రయాణిస్తున్న రాహుల్‌గాంధీని స్వీకరించడానికి మైసూరును ఎంచుకున్నారు.’’ అని అశోక ఎద్దేవా చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన దేశాధినేతను స్వాగతించకపోవడం కర్ణాటక ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యాన్ని నిదర్శనం అని ధ్వజమెత్తారు.

జర్మన్ ఛాన్సలర్ బెంగళూరు పర్యటన సందర్భంగా అడుగోడిలోని బాష్ క్యాంపస్‌ను.. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ను సందర్శించారు.

Exit mobile version