NTV Telugu Site icon

Rajouri terror attack: పీఓకే నుంచి రాజౌరి ఉగ్రదాడి.. లష్కర్ తీవ్రవాది సజ్జిద్ జుట్ హస్తం..

Jammu Kashmir

Jammu Kashmir

Rajouri terror attack: జమ్మూ కాశ్మీర్ లో ఏడు నుంచి తొమ్మిది మంది ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతాబలగాలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో సరిహద్దుల్లోని అడవులను స్కాన్ చేస్తున్నాయి. శుక్రవారం జరిగిన రాజౌరీ ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు మరణించడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యం ఉగ్రవాదుల కోసం వెతుకుతోంది. ఇప్పటికే రాజౌరీతో పాటు బారాముల్లాలో ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.

ఈ ఉగ్రదాడుల వెనక నిషేధిత లష్కరేతోయిబా ఉగ్రసంస్థ ఇంటెలిజెన్స్ తేల్చింది. రాజౌరీ-పూంచ్ సెక్టార్‌లో స్థానికుల మద్దతుతో రెండు గ్రూపుల లష్కరేతోయిబా ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తాజాగా శుక్రవారం రాజౌరీలో 9 పారా కమాండోలపై దాడిని బట్టి చూస్తే .. ఈ ప్రాంతంలో ఇద్దరు పాకిస్తానీలతో పాటు ఐదుగురు ఉగ్రవాదులతో కూడిన బృందం ఉండవచ్చని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.

Read Also: The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు ఫస్ట్ డే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని కోట్లీ నుంచి జమ్మూ రియాసి నివాసి అయిన రియాజ్ అహ్మద్ అలియాస్ ఖాసీమ్ తో పాటు లష్కర్ కమాండర్ హబీబుల్లా మాలిక్ అలియాస్ సజ్జిద్ జుట్ అలియాస్ సజ్జిద్ లాంగ్డా ఈ ఉగ్రదాడులను ఆపరేట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లాహోర్ లోని మురిద్కే ప్రాంతంలోని లష్కరేతోయిబా ప్రధాన కార్యాలయం నుంచి పథక రచన చేస్తున్నారని భద్రతా సంస్థల వద్ద సమాచారం ఉంది. దీంతో పాటు పూంచ్ లోని మెందార్ నివాసి రఫీక్ నాయ్ అలియస్ సుల్తాన్ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ లోనే ఉన్నాడు. దక్షిణ కాశ్మీర్ లో రిక్రూట్మెంట్, ఆయుధాల స్మగ్లింగ్, టెర్రర్ ఫైనాన్స్ వంటి ఉగ్రవాద కార్యకలాపాలకు వీరు పాల్పడుతున్నారు.

ఈ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్-పీఓకే సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాలను సురక్షిత స్థావరాలుగా మార్చుకుంటున్నారు. సజ్జిద్ జట్ మాడ్యూల్ 2021లో భాటా ధురియన్ అటవీ ప్రాంతంలో భారత ఆర్మీ దళాలపై దాడి చేసింది. ఈ ఉగ్రదాడిలోొ 9 మంది భారత జవాన్లు మరణించారు. ఇదిలా ఉంటే తాజాగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆర్మీ కమాండర్లు, ఉన్నతాధికారులు ఈ రోజు శ్రీనగర్ వెళ్తున్నారు.