Priyanka Gandhi: ఈ ఘటనపై సిగ్గుపడుతున్నా.. ఐరాస తీర్మానంపై భారత్ ఓటేయకపోవడంపై ప్రియాంకా గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపునిస్తూ శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్‌జీఏ)లో పలు దేశాలు కలిసి తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. గాజా స్ట్రిప్‌కి సాయం అందించడానికి, పౌరులకు రక్షణ కల్పించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్ కి భారతదేశం దూరంగా ఉంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై నేను సిగ్గుపడుతున్నా అని అన్నారు.
అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై ఆకస్మిక దాడిలో హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రస్తావన లేకపోవడంతో భారత్ ఈ తీర్మానంపై ఓటింగ్ కి దూరంగా ఉంది. దీనిపై ఎక్స్(ట్విట్టర్)లో ప్రియాంకా గాంధీ స్పందిస్తూ..‘‘ మానవత్వాన్ని తుడిచిపెట్టి, ఆహారం, నీరు, వైద్య సామాగ్రి, కమ్యూనికేషన్, విద్యుత్ పాలస్తీనాలోని లక్షలాది ప్రజలకు నిలిపివేయబడినప్పుడు, మహిళలు, పిల్లల్ని నిర్మూలిస్తున్నప్పుడు మౌనంగా నిలబడి చూస్తుండటం, ఒకదేశంగా మనదేశం జీవితాంతం నిలబడిన ప్రతీదానికి వ్యతిరేకంగా ఉంది’’ అని పోస్ట్ చేశారు. మహాత్మా గాంధీని ఉటంకిస్తూ ‘‘కంటికి కన్ను మొత్తం ప్రపంచాన్ని అంధుడిని చేస్తుంది’’ అని అన్నారు.
Also Read
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Read Also: Kerala: పాలస్తీనా అనుకూల ర్యాలీలో హమాస్ నాయకుడు.. కేరళలో వివాదాస్పద ఘటన..
యూఎన్‌జీఏ బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవులు, రష్యా, దక్షిణాఫ్రికా మొదలైన 40 కన్నా ఎక్కువ దేశాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి అనుకూలంగా 121 దేశాలు ఓటేయగా.. అమెరికా, ఇజ్రాయిల్ సహా 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, ఉక్రెయిన్, యూకే వంటి 43 దేశాలు ఓటింగ్ కి దూరంగా ఉన్నాయి. దీనిపై ఇజ్రాయిల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్మానాన్ని తిరస్కరించారు. ఇజ్రాయిల్ కి బదులుగా ‘‘నాజీ టెర్రరిస్టులకు రక్షణ’’ కొందరు ఎస్ అని ఓటేశారని విమర్శించారు.
“An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi
I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza.
Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!