NTV Telugu Site icon

Asaduddin Owaisi: చైనా పేరు చెబితేనే ప్రధాని మోదీ భయపడుతున్నారు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi’s reaction on the border clash between India and China: అరుణాచల్ ప్రదేశ్ లో ఎల్ఏసీ వెంబడి తవాంగ్ సెక్టార్ వద్ద భారత్, చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది. గల్వాన్ ఘర్షణలు జరిగిన 30 నెలల తరువాత ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ప్రస్తుతం ఈ ఘర్షణలపై పొలిటికల్ వివాదం రాజుకుంటోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. డిసెంబర్ 6న ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తితే.. డిసెంబర్ 9న కేంద్ర రక్షణశాఖ మంత్రి ప్రకటన చేయడాన్ని తప్పపడుతున్నాయి విపక్షాలు.

రాజకీయ నాయకత్వాన్ని ప్రదర్శించడంతో ప్రధాని నరేంద్రమోదీ విఫలం అవుతున్నారని..ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. డిసెంబర్ 6న ఘర్షణ జరిగితే.. డిసెంబర్ 9న ప్రకటన చేశారని.. మీడియా రిపోర్ట్ చేయకపోతే మీరు దీనిపై మాట్లాడేవారు కాదని మండిపడ్డారు. అన్ని పార్టీలను ఘర్షణ జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. చైనా పేరు చెబితేనే ప్రధాని భయపడుతున్నారని.. చైనా గురించి మాట్లాడేందుకు ఆయన ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.

Read Also: Son Chops Up Father: శ్రద్ధా కేసును తలపించేలా.. తండ్రి శరీరాన్ని 32 ముక్కలు చేసిన కొడుకు

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనపై స్పందించారు. పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలు కొనసాగించలేవకపోవడం విచారకరం అని అన్నారు. పాకిస్తాన్ తో మా సంబంధాలు బాగా లేవని.. కానీ చైనాతో కూడా మనకు మంచి సంబంధాలు లేవని అన్నారు. మాజీ ప్రధాని దివంగత ఏజీ అటల్ బీహారీ వాజ్ పేయి స్నేహితులను మార్చుకోవచ్చు అని.. మన పొరుగువారిని మార్చుకోలేమని అన్నారనే వ్యాఖ్యలను గుర్తు చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ ఘర్షణలపై స్పష్టత ఇవ్వడానికి అవకాశం ఇస్తామని సభా నాయకుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తో చెప్పినప్పటికీ.. అధికార పార్టీ మా మాట వినేందుకు సిద్ధంగా లేదని.. ఇది దేశానికి మంచింది కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం మన సైనికులతో ఉంటాం అని అన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన ప్రకటన చదివి బయటకు వెళ్లారని.. ఎలాంటి చర్చకు సిద్ధంగా లేరని విమర్శించారు.