NTV Telugu Site icon

Maharashtra: ఎంఐఎం పార్టీ నేతపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు..

Mim

Mim

ఎంఐఎం పార్టీ నేతపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ పెట్రోల్ పంపు సమీపంలో మాలెగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై కాల్పులకు పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీకి మాలిక్ ప్రముఖ నాయకుడిగా ఉన్నారు.

Read Also: MLC Jeevan Reddy: జాతీయ జెండా ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ నే..

గాయపడిన మాలిక్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. పాత ఆగ్రా రోడ్డులోని ఓ దుకాణం బయట మాలిక్ కూర్చుని ఉండగా సోమవారం అర్థరాత్రి 1.20 గంటలకు ఈ ఘటన జరిగిందని మాలెగావ్ నగర పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై అక్కడికి చేరుకుని అతనిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో.. మాలిక్ ఛాతీపై, కాలుకు గాయాలు అయ్యాయి.

Read Also: Neha Shetty: ట్రైలర్ చూసి ఫిక్స్ అవొద్దు.. అన్నీ ఉంటాయి : నేహాశెట్టి ఇంటర్వ్యూ

కాగా.. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా అతను కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై సంబంధిత ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద 307 (హత్య ప్రయత్నం)తో సహా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Show comments