Asaduddin Owaisi criticizes Prime Minister Narendra Modi: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలలో కూడా ముస్లింలకు గౌరవం లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ముస్లింలను పార్టీలు ఏటీఎంలుగా వాడుకుంటున్నాయని అసదుద్దీన్ ఆరోపించారు. కర్ణాటక హుమ్నాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. గత ఎనిమిదేళ్లుగా సెక్యులర్ పార్టీలు కూడా ముస్లింల సమస్యలపై స్పందించడం లేదని.. అంతగా దేశ రాజకీయాలను మార్చినందుకు ప్రధాని మోదీకి అభినందనలని సెటైరికల్ కామెంట్స్ చేశారు. భారత రాజకీయాల్లో ఇప్పుడు ముస్లింలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని అసద్ అన్నారు.
Read Also: తెలంగాణలో భారత్ జూడో యాత్ర ఎంట్రీ
కేవలం సమాజంలో నుంచి ఓట్లు అడిగే రాజకీయ పార్టీలు ముస్లింలను ఏటీఎం యంత్రాలుగా చూస్తున్నారని విమర్శించారు. మీరు రాజకీయ పార్టీలో కావాలా..? అల్లా కావాలా..? అని ఆలోచించుకోవాలని, మీతో ఎవరూ లేరని ముస్లింలను ఉద్దేశించి ఓవైసీ అన్నారు. ముస్లింల అఘాయిత్యాలపై ఎవరూ మాట్లాడరని.. ముస్లింలు ఎవరికీ కనిపించడం లేదని.. ఇప్పుడు సెక్యులర్ పార్టీలు ముస్లింల సమస్యలు ఎత్తేందుకు కూడా భయపడుతున్నాయని.. ఇలా ప్రధాని మోదీ దేశ రాజకీయాలను మార్చారని అన్నారు. మీకు ఈ పార్టీల నుంచి ఏమైనా వస్తుందా..? బిల్కిస్ బానోకు మీరు ఏం సమాధానం చెప్తారు..? ఆమె మీ కుమార్తె కాదా..? అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ రేపిస్టులను విడుదల చేస్తే సెక్యుటర్ పార్టీలు మౌనంగా కూర్చున్నాయని ఓవైసీ అన్నారు.
ఇది అంబేద్కర్ భూమి అని.. మన రక్తం, చెమటలో ఈ భూమికి స్వాతంత్య్రం తెచ్చుకున్నామని..ముస్లింలు తమ ప్రాణాలను ఎక్కువగా త్యాగం చేశారని ఆయన అన్నారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ లేవని.. తర్వాత వచ్చిన వాళ్లంతా హీరోలు కాగా.. తమ రక్తాన్ని ఈ భూమి కోసం అర్పించిన వారు జీరోలు అయ్యారని అసదుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. 1925 తర్వాత వచ్చిన వారు స్వాతంత్య్రం తీసుకురాలేనది అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై విమర్శలు గుప్పించారు అసదుద్దీన్ ఓవైసీ.