Site icon NTV Telugu

Asaduddin Owaisi: టిప్పు సుల్తాన్ చరిత్రను తుడిచేయలేరు.. కండోమ్‌లు ఎక్కువగా ఎవరు వాడుతున్నారు..?

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi comments on Tippu Express name change: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ‘టిప్పు ఎక్స్‌ప్రెస్’ పేరును ‘వడయార్ ఎక్స్‌ప్రెస్’గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం  రైల్వే మంత్రిత్వ శాఖ బెంగళూర్ నుంచి మైసూర్ వెళ్లే ట్రైన్ టిప్పు ఎక్స్‌ప్రెస్ పేరును వడయార్ ఎక్స్‌ప్రెస్ గా మార్చింది. బీజేపీ యజమానులు అయిన బ్రిటీష్ వారికి ఎదురొడ్డి పోరాడినందుకు వారికి కోపం తెప్పించిందని అందుకు రైలు పేరు మార్చారని దుయ్యబట్టారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్ మూడు యుద్ధాలు చేశాడనే కోపం కాషాయ పార్టీలో ఉందని ఎద్దేవా చేశారు. టిప్పు సుల్తాన్ వారసత్వాన్ని బీజేపీ ఎప్పటికీ తుడిచివేయలేదని అన్నారు. టిప్పు బతికుండగా బ్రిటీష్ వారిని భయపెట్టారు. ఇప్పుడు బ్రిటిష్ బానిసలను భయపెట్టారని బీజేపీపై విమర్శలు గుప్పించారు.

Read Also: India’s 1st Solar-Powered Village: దేశంలోనే తొలి సోలార్ గ్రామంగా మోధేరా.. ఈ రోజు ప్రధాని అధికార ప్రకటన

మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా ఈ ఏడాది జూలైలో టిప్పు ఎక్స్‌ప్రెస్ పేరును మార్చాలని రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ రైలు పేరు మార్చింది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ట్విట్ చేస్తూ.. శుక్రవారానికి శుభవార్త.. ఇప్పుడు టిప్పు ఎక్స్‌ప్రెస్ బదులుగా వడయార్ ఎక్స్‌ప్రెస్ మీకు సేవలు అందిస్తుందని.. అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి ప్రయత్నాలకు ధన్యవాదాలు తెలియజేశారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖ చర్యలను ప్రశంసించారు. ఇది కర్ణాటక రాష్ట్ర సంపన్నమైన వారసత్వం, అద్భుతమైన చరిత్రకు గుర్తింపు అని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వడయార్ రాజవంశ చేసిన కృషిని గుర్తిస్తూ రైలు పేరును మార్చారు.

ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ముస్లిం జనాభా పెరగడం లేదని.. పడిపోతుందని.. కండోమ్ ఎక్కువగా వాడుతున్నది ఎవరు..? మనమే అని వ్యాఖ్యానించారు. మోహన్ భగవత్ దీనిపై మాట్లాడరని అన్నారు.  దేశంలో ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. ముస్లింలు బహిరంగ జైలులో బతుకుతున్నట్లు అనిపిస్తోందని.. ముస్లిం కన్నా రోడ్డు పక్కన కుక్కకే ఎక్కవ గౌరవం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version