Site icon NTV Telugu

Asaduddin Owaisi: ఆ విషయంలో ప్రధాని మోదీని చిరుతతో పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi comments on PM narendra modi: ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కు పెట్టారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. తీవ్రమైన సమస్యల నుంచి తప్పించుకునే విషయంలో ప్రధాని మోదీ చిరుతల కన్నా వేగంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజస్థాన్ జైపూర్ పర్యటకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. జ్ఞాన్‌వాపి మసీదు-శృంగర్ గౌరీ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రార్థనా స్థలాల చట్టానికి వ్యతిరేకంగా ఆయన అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మదర్సాలపై ప్రభుత్వాలు సర్వే చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈనెల 17 ప్రధాని మోదీ చేతుల మీదుగా కునో నేషనల్ పార్క్ లో చిరుతలను ప్రవేశపెడుతున్నారు. అయితే దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు అసదుద్దీన్ ఓవైసీ. ద్రవ్యోల్భనం, నిరుద్యోగం సమస్యలను లేవనెత్తినప్పుడు ప్రధాని మోదీ చిరుత కన్నా వేగంగా తప్పించుకుంటారని ఎద్దేవా చేశారు. చైనా మన భూభాగాలను ఆక్రమించిందని మనం చెప్పినప్పుడు, చిరుత కన్నా మోదీ జీ వేగంగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read Also: Amit Shah: ప్రభాస్ తో అమిత్ షా భేటీ.. కారణం అదే..?

జ్ఞాన్‌వాపి మసీదు కేసులో వారణాసి కోర్టు 1991 ప్రార్థన స్థలాల చట్టాలను ఉల్లంఘించిందని ఆయన విమర్శించారు. ఈ కేసులు ఈ చట్టం పరిధిలోకి రానది కోర్టు తీర్పు చెప్పడాన్ని తప్పు పట్టారు. ప్రైవేటుగా నిర్వహించే మదర్సాలపై యూపీ ప్రభుత్వం సర్వే చేపట్టడాన్ని ఎన్ఆర్సీగా అభివర్ణించారు ఆయన. మదర్సాలపై సర్వేను మినీ ఎన్ఆర్సీ అని పేర్కొన్నారు. కేవలం మదర్సాలపైనే ఎందుకు సర్వే చేస్తున్నారు.. ఆర్ఎస్ఎస్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలు, మిషనరీ పాఠశాలపై ఎందుకు సర్వే చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఈనెల 17 కునో నేషనల్ పార్క్ లో 8 చిరుతలను ప్రధాని మోదీ ప్రవేశపెట్టనున్నారు. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో ఈ శుక్రవారం చిరుతలు జైపూర్ కు రానున్నాయి. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో కునో నేషనల్ పార్క్ కు తరలించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే రోజు వీటిని నేషనల్ పార్క్ లో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొననున్నారు.

Exit mobile version