Sunita Kejriwal: నా భర్తను కేంద్రం టెర్రరిస్టులా చూస్తోంది.. బెయిల్ వాయిదాపై కేజ్రీవాల్ భార్య..
- అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ వాయిదాపై భార్య ఫైర్..
- కేంద్రం కేజ్రీవాల్‌ని టెర్రరిస్టులా చూస్తోంది..
- దేశంలో నియంతృత్వం పెరిగిపోయింది..
- కేంద్రం టార్గెట్‌గా సునీతా కేజ్రీవాల్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ మంజూరు చేసింది. అయితే, దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్రయించగా, బెయిల్‌పై స్టే విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ని కొట్టేయాలంటూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఈడీ పిటిషన్ విచారించేందుకు కోర్టు అంగీకరించింది.
దీనిపై సునీతా కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఆర్డర్ అప్లోడ్ చేయడానికి ముందే బెయిల్‌ని వ్యతిరేకిస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఎలా ఆశ్రయించిందని ప్రశ్నించారు. తన భర్తను ప్రభుత్వం, కేంద్ర సంస్థలు వాంటెడ్ టెర్రరిస్టులా చూస్తోందని ఆమె ఆరోపించారు. దేశంలో నియంతృత్వం పెరిగిపోయిందని, నియంతృత్వం అని పరిమితులను దాటిందని ఆమె అన్నారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Read Also: Instagram : ‘క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్’ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చిన ఇన్స్టాగ్రామ్..
మరోవైపు ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘ మోడీ ప్రభుత్వం గుండాయిజం చూడండి. ట్రయల్ కోర్టు ఆర్డర్ ఇంకా రాలేదు. ఆర్డర్ కాపీ కూడా రాలేదు. మోడీ యొక్క ఈడీ హైకోర్టుకు చేరుకుంది. ఈ దేశంలో ఏం జరుగుతోంది. మోడీజీ మీరు న్యాయ వ్యవస్థను ఎందుకు అపహాస్యం చేస్తున్నారు.. దేశం మొత్తం మిమ్మల్ని గమనిస్తోంది’’ అని ఆయన అన్నారు.
ఈడీ తరుపును అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తన వాదనలు ఢిల్లీ హైకోర్టులో వినిపించగా, కేజ్రీవాల్ తురుపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి వాదనలను వినిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!