NTV Telugu Site icon

Kejriwal: ప్రధాని మోడీకి కేజ్రీవాల్ లేఖ.. మెట్రో రైళ్లలో వారికి 50 శాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్

Arvindh

Arvindh

Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. దీంతో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు 50 శాతం టికెట్‌ రాయితీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయితీ కారణంగా పడే భారాన్ని కేంద్ర, రాష్ట్రం, ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరించాలనే ప్రతిపాదనలు చేశారు.

Read Also: Rahul Gandhi : ఢిల్లీ ఎయిమ్స్ వెలువల రోగులను కలిసిన రాహుల గాంధీ.. ఇంతకీ ఏమైందంటే ?

ఇక, ఢిల్లీ స్టూడెంట్స్ కు సంబంధించి ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకు వచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నాను అంటూ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. విద్యాసంస్థలకు వెళ్లి వచ్చే క్రమంలో వారు మెట్రో రైళ్లపై ఆధారపడుతున్నారు. సదరు విద్యార్థులపై ఆర్థిక భారాన్ని దించేందుకు 50 శాతం రాయితీ అందించాలని ఆ లేఖలో వెల్లడించారు. అలాగే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ఇప్పటికే మహిళా ప్రయాణికులు బస్సుల్లో ఫ్రీగా జర్నీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.