Site icon NTV Telugu

Arvind Kejriwal: కోటీశ్వరుల రుణాలను కేంద్రం మాఫీ చేస్తోంది..

Arvindh Kejriwal

Arvindh Kejriwal

Arvind Kejriwal: కోటీశ్వరులు తీసుకున్న రుణాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం మాఫీ చేస్తోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారి రుణమాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకు రావాలని ప్రధానికి లేఖ రాశారు ఆయన. ఆ లోన్ల మాఫీ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని గురించి అందులో చెప్పుకొచ్చారు. ధనికులు తీసుకున్న రూ.వేల కోట్ల రుణాలను మాఫీ చేయడంతో పాటు వారికి అనుకూలంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో సాధారణ ప్రజలు ఎక్కువ పన్ను భారాన్ని మోయలేకపోతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

Read Also: Supreme Court: ఒక్కమాట కూడా వినకుండా చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్‌ కొట్టివేత.. సుప్రీం తీవ్ర ఆగ్రహం

ఇక, సామాన్యులు తీసుకునే గృహ, వాహన ఇతర లోన్లను కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాఫీ చేయడం లేదని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఒకవేళ బిలియనీర్ల రుణమాఫీని ఆపితే.. సామాన్యులపై ఆదాయపు పన్ను, జీఎస్టీ రేట్ల భారాన్ని సగానికి పైగా తగ్గించొచ్చు అని వెల్లడించారు. అంతేగాక, ఆదాయపు పన్ను పరిమితిని రెట్టింపు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని కూడా తొలగించ వచ్చు.. కోటీశ్వరులకు రుణమాఫీ అనేది భారీ స్కామ్.. దీనికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ తెలిపారు.

Exit mobile version