Arvind Kejriwal: కోటీశ్వరుల రుణాలను కేంద్రం మాఫీ చేస్తోంది..
- కోటీశ్వరులు తీసుకున్న రుణాలను కేంద్రం మాఫీ చేస్తోంది..
- ధనికుల రుణమాఫీని నిషేధించేలా ఒక చట్టాన్ని తీసుకురావాలి..
- బిలినీయర్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది: కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: కోటీశ్వరులు తీసుకున్న రుణాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం మాఫీ చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారి రుణమాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకు రావాలని ప్రధానికి లేఖ రాశారు ఆయన. ఆ లోన్ల మాఫీ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని గురించి అందులో చెప్పుకొచ్చారు. ధనికులు తీసుకున్న రూ.వేల కోట్ల రుణాలను మాఫీ చేయడంతో పాటు వారికి అనుకూలంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో సాధారణ ప్రజలు ఎక్కువ పన్ను భారాన్ని మోయలేకపోతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.
Read Also: Supreme Court: ఒక్కమాట కూడా వినకుండా చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత.. సుప్రీం తీవ్ర ఆగ్రహం
Also Read
ఇక, సామాన్యులు తీసుకునే గృహ, వాహన ఇతర లోన్లను కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాఫీ చేయడం లేదని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఒకవేళ బిలియనీర్ల రుణమాఫీని ఆపితే.. సామాన్యులపై ఆదాయపు పన్ను, జీఎస్టీ రేట్ల భారాన్ని సగానికి పైగా తగ్గించొచ్చు అని వెల్లడించారు. అంతేగాక, ఆదాయపు పన్ను పరిమితిని రెట్టింపు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని కూడా తొలగించ వచ్చు.. కోటీశ్వరులకు రుణమాఫీ అనేది భారీ స్కామ్.. దీనికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ తెలిపారు.
తాజావార్తలు
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!