Yogi Adityanath: ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని పదవి నుంచి దించేస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం యోగి స్పందించారు. జైలుకు వెళ్లిన తర్వాత కేజ్రీవాల్ మతిస్థిమితం కోల్పోయారని అన్నారు. గురువారం కేజ్రీవాల్‌పై ఆయన విరుచుకుపడ్డారు. ఈ ఉదయం లక్నోలో సమాజ్‌వాదీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కలిసి కేజ్రీవాల్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ప్రధాని మంత్రి చేస్తారని, యోగి ఆదిత్య నాథ్‌ని యూపీ సీఎంగా తొలగిస్తారని చెప్పారు.
Read Also: TV Anchor: తీర్థంలో మత్తుమందిచ్చి రేప్.. పూజారిపై టీవీ యాంకర్ కేసు
ఈ వ్యాఖ్యలపై యోగి స్పందిస్తూ.. కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత మతిస్థిమితం కోల్పోయారని, అన్నా హజారే ఆశయాలను తుంగలో తొక్కి అవినీతి పక్షాణ నిలిచిన ఢిల్లీ సీఎం తనను టార్గెట్ చేస్తున్నారని ఆదిత్యనాథ్ అన్నారు. హమీర్‌పూర్-మహోబా లోక్‌సభ స్థానం అభ్యర్థికి మద్దతుగా తింద్వారిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కేజ్రీవాల్ అన్నా హజారే ఆశలను వమ్ము చేశారని, ఈ ద్రోహానికి కేజ్రీవాల్‌ని ఆయన ఎప్పుడూ క్షమించరని అన్నారు.
నిరాశతో ఉన్న ప్రతిపక్షాలు మోడీ వయసును సాకుగా చూపుతోందని ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ జైలులో ఉన్నంత కాలం ఢిల్లీ ప్రజలు ‘దగ్గు’ తగ్గినట్లు ఉపశమనం పొందారు, మళ్లీ జైలు నుంచి విడుదలై వారికి ‘దగ్గు’ వచ్చే అవకాశాన్ని తెప్పించారని ఆదిత్యనాథ్ అన్నారు.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు అతడిని జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది. మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. 50 రోజుల పాటు అతను జైలులో గడిపాడు.