TV Anchor: తీర్థంలో మత్తుమందిచ్చి రేప్.. పూజారిపై టీవీ యాంకర్ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TV Anchor Filed Rape Case on Temple Priest: చెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లో ఒక ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామిపై తమిళనాడులోని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ యాంకర్ అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కేసు పెట్టింది. ఆమె విరుగంబాక్కం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నాకు తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన తర్వాత పూజారి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడని యాంకర్ తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. సాలి గ్రామానికి చెందిన 30 ఏళ్ల దివ్య (పేరు మార్చాం). తాను ఆధ్యాత్మిక వ్యక్తినని, ఆలయాలను సందర్శిస్తూనే ఉంటానని ఫిర్యాదులో పేర్కొంది. చెన్నైలోని పర్యాస్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ కాళికంపాల్ ఆలయాన్ని నేను తరచుగా సందర్శిస్తా, ఈ సమయంలో అదే ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామితో తనకు స్నేహం ఏర్పడిందని ఆమె పేర్కొంది.
సాయి పల్లవి టు శ్రీ లీల : డాక్టర్ చదివిన హీరోయిన్లు వీరే
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇద్దరి మధ్య సన్నిహిత స్నేహం ఏర్పడిన తర్వాత కార్తీక్ మునిస్వామి ఆలయంలో జరిగే విశేషాలు, ప్రత్యేక పూజల గురించి వాట్సాప్ ద్వారా సందేశాలు పంపేవాడు. స్నేహితురాలు కావడంతో దివ్య ఆలయానికి వచ్చినప్పుడల్లా కార్తీక్ మునిస్వామి ఆమెను గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం కల్పించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. రోజులు గడిచేకొద్దీ, స్నేహం పెరిగిందని పేర్కొంది. ఒకరోజు నేను గుడికి రాగా తన బెంజ్ కారులో డ్రాప్ చేస్తానని చెప్పాడు. కారులో ప్రయాణిస్తుండగా తీర్థం ఇచ్చారని, దీంతో తాగిన తర్వాత నాకు స్పృహ తప్పింది. ఆ తర్వాత నాపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కార్తీక్ మునిస్వామి గుడిలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దీని తర్వాత కార్తీక్ మునిస్వామి చాలాసార్లు మా ఇంటికి వచ్చారు, ఆ తర్వాత నేను కూడా గర్భవతిని అయ్యాను. ఈ విషయం తెలిసి వడపళనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఆ తర్వాత నన్ను కూడా సెక్స్ వర్క్ చేయమని బలవంతం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఫిర్యాదు మేరకు విరుగంబాక్కం మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు కార్తీక్ మునిస్వామిని అరెస్ట్ చేశారు. అంతే కాకుండా, టీవీ యాంకర్‌తో ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలు మరియు వీడియోలు కూడా అతని మొబైల్ ఫోన్ నుండి రికవరీ చేయబడ్డాయి. కార్తీక్ మునిస్వామిని మొత్తం ఆరు ఐపీసీ సెక్షన్ల కింద అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత దివ్య చెన్నైకి చెందిన ఓ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది.
- Tags
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!