Site icon NTV Telugu

Arvind Kejriwal: జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలనని ప్రధాని మోడీకి చూపిస్తా..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన పదవికి రాజీనామా చేస్తే దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలనని ప్రధాని నరేంద్రమోడీకి చూపించబోతున్నానని అన్నారు. తన రాజీనామా గురించి మాట్లాడుతూ..‘‘ నరేంద్రమోడీకి కావాల్సింది ఇదే. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ని ఓడించలేనని ఆయనకు తెలుసు. అందుకే ఈ ప్లాన్‌కి శ్రీకారం చుట్టారు. వారి తదుపరి లక్ష్యం పశ్చమ బెంగాల్, తమిళనాడు సీఎంలు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్. తాను రాజీనామా చేస్తే దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

Read Also: T. Harish Rao: బస్సు తప్పా అన్ని పథకాలు తుస్సే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు

తనకు ఏ పదవిపై అత్యాశ లేదని చెప్పారు. ఢిల్లీలో మురికివాడల్లో పనిచేయడం కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేశానని, 49 రోజులకే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశానని, కానీ ఈ రోజు నా పోరాటంలో భాగంగానే రాజీనామా చేయడం లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ అన్నారు. సీఎం పదవికి రాజీనామాపై వారు పిల్ కూడా దాఖలు చేశారు, కానీ సుప్రీంకోర్టు రాజీనామా చేయమని బలవంతం చేయలేమని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. సీఎంగా తన విధుల్ని నిర్వర్తించడానికి నాకు జైలులో ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలని కోర్టును కోరుతానని చెప్పారు.

ఎక్కడ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయానా ప్రధాని మోడీ ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్ని, ఇతర నేతల్ని అరెస్ట్ చేస్తారని, నేను రాజీనామా చేయకుంటే ఇతర ముఖ్యమంత్రులను ప్రధాని టచ్ చేయడానికి సాహసించరని అన్నారు. ఢిల్లి లిక్కర్ స్కామ్‌లో ఈడీ మార్చి 12న కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. అయితే, ఎన్నికల్లో ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది.

Exit mobile version