NTV Telugu Site icon

Kejriwal: న్యూఢిల్లీ అభ్యర్థిగా కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు

Kejriwal

Kejriwal

మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి హనుమాన్, వాల్మీకి ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆప్ కార్యాలయం నుంచి న్యూఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఇది కూడా చదవండి: UP: డబ్బుల విషయంలో తగాదా.. ఆటో డ్రైవర్‌పై యువతి దాడి.. వీడియో వైరల్

“నేను నామినేషన్ దాఖలు చేశాను. దయచేసి చేసిన పనికి ఓటు వేయండి. ఒక వైపు పనిచేసే పార్టీ మరొక వైపు దుర్వినియోగం చేసే పార్టీ ఉంది… కాబట్టి పనికి ఓటు వేయండి అని ఢిల్లీ ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను. విద్య, వైద్యం, విద్యుత్, నీరు, రోడ్లు, వీటికి ఓటు వేయండి. చాలా పనులు జరిగాయి. ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి కాబట్టి ప్రజలు కష్టపడి ఓట్లు వేస్తారని ఆశిస్తున్నాను.’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

ఇది కూడా చదవండి: Pakistan: “9/11 దాడుల్ని” గుర్తుకు తెచ్చిన పాక్ ఎయిర్‌లైన్ పోస్ట్.. విచారణకు ఆదేశించిన పీఎం షెహబాజ్..

ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. నామినేషన్లకు చివరి తేది జనవరి 17 కాగా.. నామినేషన్ల పరిశీలన జనవరి 18… ఉపసంహరణకు జనవరి 20వ తేదీ చివరి రోజు కానుంది.

Show comments