NTV Telugu Site icon

Article 370: ‘‘ఆర్టికల్ 370ని తీసేయలేరు’’.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్..

Supreme Court

Supreme Court

Article 370: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ‘ఆర్టికల్ 370’ని బీజేపీ నేతృత్వంలోని 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ మళ్లీ సుప్రీంకోర్టులో ‘రివ్యూ పిటిషన్’ దాఖలైంది.

J&K పీపుల్స్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు డాక్టర్ హుస్సేన్ మరియు J&K అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ముజాఫర్ షా మాట్లాడుతూ..తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ‘‘ ఆర్టికల్ 370ని తీసేయలేమని.. ఆర్టికల్ 370పై సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని, మేము కోర్టులో కోర్టులో చర్చిస్తాము’’ అని ముజఫర్ షా చెప్పారు. సీపీఐ(ఎం)కి చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన అడ్వకేట్‌ ముజఫర్‌ ఇక్బాల్‌, పీడీపీలు కూడా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి.

Read Also: 12th Fail: రియల్ లైఫ్ “12th ఫెయిల్” ఐపీఎస్ ఆఫీసర్, భార్యతో ఉన్న ఫోటోలు వైరల్..

గత నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో పాటు న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్ మరియు సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370ని రద్దుని సమర్థించింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమే అని నొక్కి చెప్పింది. యుద్ధకాల పరిస్థితుల కారణంగా ఆర్టికల్ 370 రూపొందించబడిందని చెప్పింది. భారత యూనియన్‌లో చేరిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండలేదని సుప్రీం వ్యాఖానించింది. రాజ్యాంగ పరిషత్‌ ఆగిపోయినందున ఆర్టికల్‌ 370 శాశ్వతంగా కొనసాగుతుందని అర్థం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని రద్దుకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని సుప్రీం పేర్కొంది. సెప్టెంబర్ 30, 2024లోగా జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించేలా భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆగస్టు 5, 2019న, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ, ఆ ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.