Site icon NTV Telugu

Air India Plane Crash: 2000 మందిని రక్షించిన ఎయిర్ ఇండియా పైలట్లు..

Air India Plane Crash

Air India Plane Crash

Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టింది. గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో 241 మంది మరణించారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. విమానం డాక్టర్ హాస్టల్ భవనంపై కూలడంతో 24 మంది మెడికోలు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు.

Read Also: King Charles: కింగ్ చార్లెస్ కీలక నిర్ణయం.. ఎయిరిండియా మృతులకు నిమిషం మౌనం పాటించనున్న చార్లెస్

ఇదిలా ఉంటే, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదాని ప్రకారం ఒక వేళ విమానం నివాస ప్రాంతాల్లో విమానం కూలి ఉంటే పెను విపత్తు సంభవించేదని చెబుతున్నారు. విమాన ప్రాంతాల్లో కూలిపోయి ఉంటే 1500-2000 మంది ప్రాణాలు కోల్పోయేవారని చెబుతున్నారు.

“ప్రమాదం తర్వాత పూర్తిగా గందరగోళం నెలకొంది. మేము సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు 15 నుండి 20 మందిని రక్షించగలిగాము. సాధారణంగా, విమానాలు ఎత్తులో ఎగురుతాయి, కానీ ఇది ప్రమాదకరంగా ఇళ్లకు దగ్గరగా వెళ్లింది. నివాస ప్రాంతం నుండి కొంచెం దూరంగా విమానాన్ని క్రాష్ చేసినందుకు పైలట్‌కు సెల్యూట్ – లేకపోతే, 1,500 నుండి 2,000 మంది సులభంగా చనిపోయేవారు” అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

Exit mobile version