NTV Telugu Site icon

Jammu Kashmir: పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. ముగ్గురు జవాన్లు మృతి

Indian Army

Indian Army

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఈ రోజు ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడికి పాల్పడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో దాడి ఇది. దాడి జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలు పంపినట్లు సమాచారం. కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. పూంచ్‌లోని సురన్‌కోట ప్రాంతంలోని డేరా కీ గలీ(డీకేజీ) ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు.

ఈ రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి జరిగింది. రెండు ఆర్మీ వాహనాలపై దాడి జరిగింది. బుధవారం రాత్రి నుంచే ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం ఆర్మీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది.

Read Also: Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి బెయిల్ ఇవ్వొద్దు.. డీసీపీ వచ్చి బ్రతిమలాడినా వినలేదు!

బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సాయుధ పోలీసు యూనిట్ కాంపౌండ్‌లో పేలుడు సంభవించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత నెలలో రాజౌరీ లోని కలాకోట్ ప్రాంతంలో సైన్యానికి, ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లతో పాటు పలువురు సైనికులు మరణించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారడంతో సైన్యంపై దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన జంట దాడుల్లో 10 మంది సైనికులు మరణించారు.