Indian Army: ‘‘ఈసారి ఆపరేషన్ సిందూర్ దారుణంగా ఉంటుంది’’.. పాక్‌కు భారత్ వార్నింగ్..

  • ఆపరేషన్ సిందూర్ 2.0 మరింత తీవ్రంగా ఉంటుంది..
  • పాకిస్తాన్ కు భారత సైనిక అధికారి వార్నింగ్..
Operation Sindoor

Operation Sindoor

Indian Army: భారత్ మరోసారి ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభిస్తే ఈసారి పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, ఆ దెబ్బ తీవ్రత మరింత గట్టిగా ఉంటుందని భారత సైనిక ఉన్నతాధికారి హెచ్చరించారు. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత్ పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ సైన్యం భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వైమానిక స్థావరాలను మన క్షిపణిలు ధ్వంసం చేశాయి.

Read Also: Benjamin Netanyahu: ‘‘ఇజ్రాయిలీల కళ్లు చెమ్మగిల్లాయి’’.. మోడీ ప్రసంగంపై నెతన్యాహూ భావోద్వేగం..

“ఆపరేషన్ సిందూర్‌లో మనం చేసిన దానికంటే ప్రతిస్పందన బలంగా ఉంటుంది. మనం ఎంత స్పందిస్తాము, ఏ స్థాయికి వెళ్తాము అనేది అంతా ఆ నిర్దిష్ట రోజు మరియు ఆ నిర్దిష్ట సమయంలో ఉన్న పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కానీ మనం గతసారి కంటే కఠినంగా స్పందించాల్సి ఉంటుందని మాకు చాలా ఖచ్చితంగా తెలుసు” అని వెస్ట్రన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ గురువారం అన్నారు.

పాకిస్తాన్ ప్రాక్సీ యుద్ధాలక పాల్పడుతోందని కటియార్ అన్నారు. పాక్ నేరుగా పోరాడలేదని, కాబట్టి వారు యుద్ధానికి తన ప్రాక్సీలను ఉపయోగిస్తున్నారని, పాక్ దుర్భలమైన బలహీన దేశమని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ కోసం మన కాళ్లపై పడ్డారని ఆయన అన్నారు.