PNB Bank: బ్యాంక్లో భారీ చోరి.. సిబ్బంది ఉండగానే రూ. 18.8 కోట్ల నగదు లూటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని బ్యాంక్లో భారీ చోరరీ జరిగింది. ఉఖ్రుల్ జిల్లాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి దుండగులు రూ. 18 కోట్ల నగదు దొంగలించ పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం తర్వాత బ్యాంక్ లావాదేవీలు, డిపాజిట్ కార్యకలాపాలను ముగించిన అనంతరం మెయిన్ షటర్‌ను మూసేశారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ సహా ఇతర సిబ్బంది లోపల పనిచేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మాత్తుగా లోపలికి ప్రవేశించారు. ముఖానికి ముసుగు వేసుకుని ఉన్న 10 మంది నేరుగా బ్యాంక్ దూరి.. స్ట్రాంగ్ రూమ్ వద్ద విధుల్లో ఉన్న బ్యాంక్ మేనేజర్, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు.
Also Read: Bank Mistake: బ్యాంక్ తప్పిదం.. మహిళ అకౌంట్లో రూ. 700 కోట్లు జమ
Also Read
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
అనంతరం బ్యాంకులో ఉన్న రూ.18.85 కోట్ల నగదును కాజేసి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృష్యాలు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఇందులో దుండగులు ఏకే రైఫిల్స్ సహా పలు ఆయుధాలతో లోపలికి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు మణిపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మే 3న జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత మణిపూర్ రాష్ట్రంలో బ్యాంక్‌లో చోరి జరగడం ఇది మూడోసారి. దీంతో బ్యాంక్ ఖాతాదారులు, స్థానికులు ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ED Officer Arrest: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈడీ ఆఫీసర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
తాజావార్తలు
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!