NTV Telugu Site icon

Lok sabha: లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు స్టాల్ ప్రారంభం

Loksabha

Loksabha

అరకు కాఫీకి ఎంత విశిష్టత ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మరింత ఖ్యాతి గడించబోతుంది. సోమవారం లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు స్టాల్ ప్రారంభం అయింది. వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ స్టాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ASHA Workers Protest: హైదరాబాద్ లో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం

పార్లమెంట్‌ ప్రాంగణంలో కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. ఓం బిర్లా అనుమతితో గిరిజన కోఆపరేటివ్‌ సొసైటీ సంగం కాంటీన్‌లో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసిందొ. సంగం 1, 2 కోర్టు యార్డ్ దగ్గర స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఇటీవల అనుమతించారు. ఆయన ఆదేశాలతో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్‌సభ భవనాల డైరెక్టర్‌ కుల్‌ మోహన్‌ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు స్పీకర్ అవకాశం కల్పించారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: మరో నాలుగు రోజులు వడగళ్ల వాన..! వాతావరణశాఖ హెచ్చరిక