iPhone: రికార్డ్ క్రియేట్ చేసిన ఆపిల్.. ఒక నెలలో భారత్ నుంచి అత్యధిక ఎగుమతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple makes history: ఎగుమతుల్లో ఆపిల్ సంస్థ రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశం నుంచి రికార్డ్ స్థాయిలో ఐఫోన్లను ఎగుమతి చేసి చరిత్ర సృష్టించింది. ఏకంగా భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఆపిల్ 2022 డిసెంబర్ నెలలో రూ. 8100 కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసి సత్తా చాటింది. మొత్తం భారత్ తో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులను రూ. 10,000 కోట్లకు తీసుకెళ్లింది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 9 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉంది.
Read Also: Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. 70 ఏళ్లుగా మమ్మల్ని దోచేస్తున్నారు..
Also Read
బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతం ఇచ్చేలా ఒకే నెలలో 1బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసిన మొదటి కంపెనీగా ఆపిల్ నిలిచింది. భారత్ నుంచి మొబైల్ ఫోన్లు ఎగుమతి చేయడంలో ఆపిల్, శాంసంగ్ అగ్రగామిగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆపిల్ దేశంలో టాప్ మొబైల్ ఫోన్ ఎగుమతిదారుగా శాంసంగ్ ను అధిగమించింది.
ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 12, 13, 14, 14 ప్లస్ సహా అనేక ఐఫోన్ మోడళ్లనున ఉత్పత్తి చేసి, ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకలో తయారీ యూనిట్లు ఉన్నాయి. ఏప్రిల్ 2020లో భారత ప్రభుత్వ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకంలో భాగస్వామిగా ఆపిల్ ఉంది. ఈ పథకం కింద భారత్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్‌ల తయారీ కేంద్రంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. పథకంలో భాగంగా, తయారీదారులు ఉత్పత్తి, ఎగుమతులు, పెట్టుబడులు మరియు ఉద్యోగాలకు సంబంధించిన డేటాను ప్రభుత్వానికి క్రమం తప్పకుండా సమర్పించాలి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!