NTV Telugu Site icon

iPhone: రికార్డ్ క్రియేట్ చేసిన ఆపిల్.. ఒక నెలలో భారత్ నుంచి అత్యధిక ఎగుమతులు

Apple

Apple

Apple makes history: ఎగుమతుల్లో ఆపిల్ సంస్థ రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశం నుంచి రికార్డ్ స్థాయిలో ఐఫోన్లను ఎగుమతి చేసి చరిత్ర సృష్టించింది. ఏకంగా భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఆపిల్ 2022 డిసెంబర్ నెలలో రూ. 8100 కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసి సత్తా చాటింది. మొత్తం భారత్ తో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులను రూ. 10,000 కోట్లకు తీసుకెళ్లింది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 9 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉంది.

Read Also: Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు.. 70 ఏళ్లుగా మమ్మల్ని దోచేస్తున్నారు..

బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతం ఇచ్చేలా ఒకే నెలలో 1బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసిన మొదటి కంపెనీగా ఆపిల్ నిలిచింది. భారత్ నుంచి మొబైల్ ఫోన్లు ఎగుమతి చేయడంలో ఆపిల్, శాంసంగ్ అగ్రగామిగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆపిల్ దేశంలో టాప్ మొబైల్ ఫోన్ ఎగుమతిదారుగా శాంసంగ్ ను అధిగమించింది.

ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 12, 13, 14, 14 ప్లస్ సహా అనేక ఐఫోన్ మోడళ్లనున ఉత్పత్తి చేసి, ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకలో తయారీ యూనిట్లు ఉన్నాయి. ఏప్రిల్ 2020లో భారత ప్రభుత్వ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకంలో భాగస్వామిగా ఆపిల్ ఉంది. ఈ పథకం కింద భారత్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్‌ల తయారీ కేంద్రంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. పథకంలో భాగంగా, తయారీదారులు ఉత్పత్తి, ఎగుమతులు, పెట్టుబడులు మరియు ఉద్యోగాలకు సంబంధించిన డేటాను ప్రభుత్వానికి క్రమం తప్పకుండా సమర్పించాలి.

Show comments