NTV Telugu Site icon

Apache Helicopter: చాపరల్‌లో సాంకేతిక సమస్య.. అపాచీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్‌

Apachi

Apachi

Apache Helicopter: భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ ఈరోజు మధ్యప్రదేశ్‌లోని బింద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చాపరల్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ గుర్తించాడు. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు. అయితే పైలట్ ముందుగానే గమనించడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

చాపరల్ లో సమస్య పరిస్కరించాక మళ్లీ లేవనున్నట్లు వెల్లడించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. AH-64 అపాచీ హెలికాప్టర్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన హెలికాప్టర్. ఇది మల్టీరోల్ ఆపరేషన్లలో ఉపయోగించబడుతుంది. భారత వైమానిక దళానికి 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. 2020లో భారత సైన్యం బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు హెలికాప్టర్లకు ఒప్పందం కుదిరింది.
2018: ఇది తెలుగు సినిమా అభిమానులు అంటే…