BJP MP Controversy: ఈ బీజేపీ ఎంపీ బెల్టు ధర జస్ట్ లక్షే.. అందుకే పార్లమెంట్లో కవర్ చేశాడు..?
- లక్ష రూపాలయ బెల్టు ధరించిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్..
- అనురాగ్ ఠాకూర్ బెల్టుపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం..
- స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పి బీజేపీ ఎంపీ విదేశీ ఖరీదైన బ్రాండ్లను వినియోగిస్తున్నారని ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Controversy: సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఖరీదైన బ్రాండ్ల వస్తువులను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఒకవైపు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్తునే.. మరోవైపు విదేశీ లగ్జరీ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇస్తుండటం తరచూ విమర్శలకు దారి తీస్తుంది. తాజాగా ఇదే ఇష్యూపై బీజేపీ కీలక నేత, ఎంపీ అనురాగ్ ఠాకూర్ నెట్టింట తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అందుకు కారణం ఆయన ధరించిన ఓ ఖరీదైన లూయిస్ విట్టన్ (Louis Vuitton) బెల్టు.
Read Also: Ajit Pawar: వెలుగులోకి అజిత్ పవార్ చివరి ఫోన్ కాల్ సంభాషణ.. మరణానికి ముందు ఏం మాట్లాడారంటే..!
Also Read
- Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 21 మంది మృతి, పలువురికి గాయాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
అయితే, ప్రస్తుతం పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. లోక్‌సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో అమిత్ షాకు మద్దతుగా వెనక వరుసలో కూర్చున్న ఎంపీలు, మంత్రులు ఒక్కసారిగా పైకి లేచారు. వారిలో అనురాగ్ ఠాకూర్ కూడా పైకి లేచి ఏదో చెప్పబోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Read Also: Ricky Ponting: వరల్డ్‌కప్‌లో భారత్ ఆశలు అతడిపైనే.. అభిషేక్‌పై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు
ఇక, ఆ వీడియోలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ధరించిన లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ బెల్టు నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించింది. బెల్ట్ స్పష్టంగా కనిపించకుండా ఆయన బ్లేజర్‌తో కవర్ చేసేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించడంతో విమర్శలకు దారి తీసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకవైపు స్వదేశీ వస్తువుల వాడాలని ఉపన్యాసాలు ఇస్తూ.. మరోవైపు లక్షల విలువైన విదేశీ బ్రాండ్లు ఉపయోగిస్తున్నారు.. ఇదే బీజేపీ నేతల నిజ స్వరూపం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరికొందరు, పాలసీలను సమర్థించుకోవడం కంటే డిజైనర్ బెల్టులను దాచుకోవడానికే రాజకీయ నాయకులు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారని విమర్శించారు. మొత్తం వ్యవస్థ పరిస్థితికి ఈ వీడియోనే నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ధరించిన లూయిస్ విట్టన్ బెల్ట్ ధర రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజకీయ నేతలు ఖరీదైన లగ్జరీ బ్రాండ్లు వినియోగిస్తూ, సామాన్య ప్రజలకు మాత్రం నీతులు చెబుతున్నారనే భావన నెటిజన్లలో పెరిగిపోతుంది. ముందు నాయకులే మారాలి, ఆ తర్వాతే ప్రజలకు ఉపదేశాలు ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
Anurag Thakur who tells children of poor Hindus to leave education and come on the streets to save religion was seen wearing a INR 80,000 imported Louis Vuitton Belt in Lok Sabha.
He got scared and hid it when it accidentally got exposed on camera because just a few minutes ago… pic.twitter.com/yOGWQdQBaf
— Roshan Rai (@RoshanKrRaii) February 3, 2026
తాజావార్తలు
-
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
-
Team India Series: భారీ సిరీస్‌కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!