Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Police Commissioner: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆయనను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్ కుమార్, ఈ నియామకానికి ముందు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో స్పెషల్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇప్పటివరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సతీష్ గోల్చాను పదవీకాలం పూర్తికాకముందే ఆ బాధ్యతల నుంచి తప్పించారు. 1992 బ్యాచ్ AGMUT కేడర్‌కు చెందిన గోల్చా 2027 వరకు ఈ పదవిలో కొనసాగాల్సి ఉన్నప్పటికీ, పరిపాలనా మార్పుల్లో భాగంగా ముందుగానే రిలీవ్ చేశారు. అనురాగ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం గోల్చా తదుపరి పోస్టింగ్ కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు రిపోర్ట్ చేయనున్నారు.
Also Read
- Hydrogen Fuel Cell Train: తొలి "హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్" రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్‌కార్డ్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
ఎవరు ఈ అనురాగ్ కుమార్?
అనురాగ్ కుమార్ పోలీసింగ్‌తో పాటు ఇంటెలిజెన్స్ రంగంలోనూ విశేష అనుభవం కలిగిన అధికారి. ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన, ఢిల్లీ పోలీస్‌లో పలు జిల్లాలకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP)గా పనిచేశారు. అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరి అంతర్గత భద్రత, నిఘా కార్యకలాపాలకు సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2010లో పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, 2016లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ పురస్కారాలు లభించాయి. వ్యూహాత్మక ప్రణాళికలు, భద్రతా వ్యవహారాల్లో నైపుణ్యం కలిగిన అధికారిగా అనురాగ్ కుమార్‌కు మంచి గుర్తింపు ఉంది.
ఈ ఏడాది మార్చి 3న ఢిల్లీ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. 50 మంది ఐపీఎస్‌లు, 20 మంది డానిప్స్ అధికారులతో కలిపి మొత్తం 70 మంది అధికారులను వివిధ విభాగాలకు బదిలీ చేశారు. ఆ పరిపాలనా మార్పుల కొనసాగింపుగానే ఇప్పుడు అనురాగ్ కుమార్‌ను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమించినట్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
ట్రెండింగ్
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!