NTV Telugu Site icon

Puja khedhkar: పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

Pujakhedhkar

Pujakhedhkar

మాజీ ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. శారీరక, మానసిక వైకల్యం ఉందంటూ తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఐఏఎస్ ఉద్యోగం సంపాదించినట్లు రుజువు కావడంతో యూపీఎస్పీ ఆమెపై వేటు వేసింది. ట్రైనీ ఐఏఎస్‌గా ఆమె ఎంపికను రద్దు చేయడంతో పాటు జీవితంలో మళ్లీ ఎలాంటి ప్రవేశ పరీక్షలు/యూపీఎస్సీ సెలెక్షన్స్‌లో పాల్గొనకుండా శాశ్వతంగా నిషేధం విధించింది. యూపీఎస్సీకి పూజా ఖేద్కర్‌ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: Mohan Babu: మోహన్‌ బాబుకు హైకోర్టు షాక్

సోమవారం ముందస్తు బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె ఉద్దేశాలు, ప్రాథమికంగా అధికారులను మోసగించడమేనని కోర్టు పేర్కొంది. పెద్ద కుట్రలో భాగంగానే ఆమె విధంగా చేసిందని.. ఇది చాలా బలమైన కేసుగా ఉందని జస్టిస్ చంద్ర ధరి సింగ్ పేర్కొన్నారు. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్‌కు కూడా ఆమె అనర్హులని తెలిపింది. ఆమె దేశం మొత్తాన్ని మోసం చేసిందని కోర్టు అభిప్రాయపడింది. యూపీఎస్సీని మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసినట్లుగా గుర్తించామని తెలిపింది. ముందస్తు బెయిల్‌పై గత నెలలో ఉత్తర్వులను రిజర్వ్ చేయగా.. తాజాగా సోమవారం ముందస్తు బెయిల్‌ను ధర్మాసనం నిరాకరించింది.

ఇది కూడా చదవండి: High Court: డెడ్ బాడీని రేప్ చేయడం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

పూజా ఖేద్కర్… పూణెలో ఐఏఎస్ ట్రైనీగా విధులు నిర్వహిస్తుండగా హద్దు మీరి ప్రవర్తించారు. గొంతెమ్మ కోర్కెలు కోరి.. తన ఉద్యోగానికి ఎసరు తెచ్చుకుంది. వాస్తవంగా ట్రైనీగా ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ తనకు ప్రత్యేకమైన ఛాంబర్, టేబుల్, అలాగే కారు ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేసింది. వాళ్లపై తండ్రితో కలిసి తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆమెను మరో చోటికి బదిలీ చేశారు. అంతలోనే ఆమె అసలు బాగోతం బయటపడింది. ఆమె తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించిందని.. అలాగే పేర్లు కూడా మార్చుకుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో యూపీఎస్సీ విచారణ చేపట్టగా.. ఆమె అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు దొంగ పత్రాలుగా అధికారులు గుర్తించారు. దీంతో ఆమెపై శాశ్వతంగా వేటు వేశారు. భవిష్యత్‌లో ఎలాంటి పరీక్షలు రాయకుండా యూపీఎస్సీ వేటు వేసింది.

ఇది కూడా చదవండి: Hyderabad: వాహనంలో గంజాయి సరఫరాపై ఖండించిన ఐకియా..

Show comments