NIA: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 5 రాష్ట్రాల్లో 19 చోట్ల ఎన్ఐఏ దాడులు..
- 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు..
- ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యం..
- ఉగ్ర ప్రచారం ప్రారంభించిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ..
- పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA: నిషేధిత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైష్ ఏ మహ్మద్(జేఈఎం)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపేలా చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతుగా ప్రచారానికి పాల్పడుతున్నారని.. అస్సాం, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లోని 19 చోట్ల దాడులు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని బామ్‌జూ మట్టన్ ప్రాంతం, బారాముల్లాలోని క్రీరీ, బుద్గామ్‌లోని ఖాన్ సాహిబ్ ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్ రూరల్ పోలీసులు సహకారంతో ఎన్ఐఏ అధికారులు సనంద్ పట్టణంలోని ఆన్‌లైన్ రాడికల్ సంస్థకు చెందిన ఆదిత్ వేపారి ఇంటిలో సోదాలు నిర్వహించింది. ఇతను బనాస్ కాంథా జిల్లా చెఖలా గ్రామంలోని మదరస్సాలో పనిచేస్తున్నాడని తేలింది. మహారాష్ట్రలోని భివాండీ, అమరావతిలో దాడు నిర్వహించారు. భివాండీలోని ఖాడీపూర్ లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో కమ్రాన్ అన్సారీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అన్సారీ దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అమరావతిలోని ఛాయానగర్ ప్రాంతంలో 35 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్‌కి చెందిన ఇస్లామిస్ట్ సంస్థలతో ఇతను సంప్రదింపులు జరుపుతున్నట్లుగా అధికారులు తెలిపారు.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
Read Also: MLA Raja Singh : మోహన్‌బాబు క్షమాపణలు చెప్పడం ఉత్తమం.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
అనుమానితుల రహస్య స్థావరాలపై తెల్లవారుజాము నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఎన్ఐఏ సోదాలు నిర్వహించి షేక్ సుల్తాన్ సలా ఉద్దీన్ అయూబీ అలియాస్ అయూబీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన రెండు నెలల తర్వాత ఈ సోదాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే యూపీలోని ఝాన్సీలోని మద్రాస్ ఆపరేటర్ ముఫ్తీ ఖలీద్ నివాసంపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో నిరసనలు చెలరేగాయి. ఎన్ఐఏ చట్టప్రకారం మాత్రమే చేస్తోందని, ఆందోళన చెందాల్సిన పని లేని ప్రజలు చెప్పారు. ఖలీద్‌ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ రోజు జరిగిన దాడుల్లో ఎన్ఐఏ కరపత్రాలను, మ్యాగజైన్‌లను, ఎలక్ట్రిక్ పరికరాలతో సహా పలు నేరారోపిత పత్రాలను స్వాధీనం చేసుకుంది. నిందితులు భారతదేశం అంతటా హింసాత్మక దాడులకు పాల్పడేందుకు పలువురి వ్యక్తుల్ని ప్రేరేపిస్తున్నారని, పలువురిని ర్యాడికలైజ్ చేసేందుకు యత్నిస్తున్నారని ఎన్ఐఏ చెప్పింది.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!