NTV Telugu Site icon

Rajasthan CM: రాజస్థాన్‌లో కూడా సర్‌ప్రైజ్ తప్పదా..? సీఎం రేసులో ఉంది వీరే..

Rajasthan

Rajasthan

Rajasthan CM: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థుల ఎన్నికలో బీజేపీ అందరిని ఆశ్యర్యానికి చేసింది. ఇప్పటికే ఛత్తీస్గడ్‌కి విష్ణదేవ్ సాయ్, ఎంపీకి మోహన్ యాదవ్‌లను సీఎంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రానికి సీఎంగా కొత్తవారిని ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని సమాచారం. ఇక్కడ కూడా బీజేపీ బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శాసనపక్ష నేతను బీజేపీ ఎమ్మె్ల్యేలు ఎన్నుకోబోతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజేని సీఎంగా చేస్తారా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఇద్దరు సహ పరిశీలకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే, జాతీయ ఉపాధ్యక్షురాలు సరోజ్‌ పాండే సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని కోరినట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి రేసులో ఉంది వీరే..

కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్‌లతో పాటు వసుంధర రాజే సీఎం రేసులో ముందు వరసలో ఉన్నారు. వీరితో పాటు జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీపీ జోషి, సీనియర్ నేత కిరోడి లాల్ మీనా, బాబా బాలక్ నాథ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే శాసన సభ పక్ష సమావేశానికి ముందుగా కొత్తగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు వసుంధర రాజేని కలుసుకున్నారు. ఆదివారం కూడా దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు ఆమె నివాసానికి వెళ్లారు.

Read Also: PM Modi: కాంగ్రెస్ ‘మనీ హీస్ట్’.. 70 ఏళ్లుగా దోచుకుంటోంది..

రెండు రాష్ట్రాల్లో అనూహ్య నిర్ణయాలు:

బీజేపీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గిరిజన నాయకుడు విష్ణుదేవ్ సాయ్‌ని ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్‌ని కాదని ఆయను సీఎం చేయడం అందర్ని ఆశ్చర్యపరిచింది. రేపు ఈ రెండు రాష్ట్రాలు వారు ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేత, నాలుగు పర్యాయాలుగా సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్‌ని కాదని బీజేపీ మాజీ క్యాబినెట్ మంత్రి మోహన్ యాదవ్‌ని సీఎంగా ఎంచుకుంది. చౌహాన్ సంక్షేమ పథకాలు, జనాధరణతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ సంచలన విజయం సాధించింది.