Site icon NTV Telugu

Bihar: బీహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 15 రోజుల్లో 7కి చేరిన సంఖ్య

Bh 2

Bh 2

బీహార్‌లో మరో బ్రిడ్జి కూలిపోయింది. 15 రోజుల్లో ఇది ఏడో ఘటన కావడం విశేషం. వరుసగా వంతెనలు కూలడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఆర్జేడీ నేతలు.. నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయినా కూడా వంతెనలు కూలుతూనే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: CM Chandrababu: రాజధాని పునర్‌ నిర్మాణం చేసి తీరాల్సిందే.. చంద్రబాబు భావోద్వేగం

బీహార్‌లోని సివాన్ జిల్లాలో గండకి నదిపై వంతెన కూలిపోవడంతో 15 రోజుల వ్యవధిలో ఏడవ ఘటన చోటు చేసుకుంది. డియోరియా బ్లాక్‌లో ఉన్న ఈ చిన్న వంతెన అనేక గ్రామాలను మహరాజ్‌గంజ్‌తో కలుపుతుంది. డియోరియా బ్లాక్‌లోని వంతెన మరమ్మతుల్లో ఉందని డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. భారీ వర్షాలు, నదుల ఉప్పెన కారణంగా బ్రిడ్జిలు కూలుతున్నాయని ముఖేష్ కుమార్ తెలిపారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ జరుపుతోందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Immunity Boost Drinks : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలా.. వీటిని తాగాల్సిందే..

ఈ సంఘటన తెల్లవారుజామున 5 గంటలకు జరిగిందన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వంతెన 1982-83లో నిర్మించినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా వంతెనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయని కుమార్ తెలిపారు. ఇటీవల మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ వంటి జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలపై దర్యాప్తు చేయడానికి బీహార్ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

ఇది కూడా చదవండి: Hathras stampede: హత్రాస్ తొక్కిసలాటపై రష్యా అధినేత పుతిన్ సంతాపం..

Exit mobile version