Rekha Gupta: రేఖా గుప్తా దాడి కేసులో మరో నిందితుడు అరెస్ట్.. ఇతడేం చేశాడంటే..!
- రేఖా గుప్తా దాడి కేసులో మరో నిందితుడు అరెస్ట్
- విచారణలో కీలక విషయాలు రాబట్టిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసులో మరొక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తహసీన్ సయ్యద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అదుపులోకి తీసుకున్నారు. తహసీన్ సయ్యద్.. ప్రధాన నిందితుడు సకారియా రాజేష్‌భాయ్ ఖిమ్జీ(41) స్నేహితుడిగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Tragedy: ప్రేమ వివాహం కానీ, ప్రేమే లేదు.. ఆ కారణంతో భార్యను హత్య చేసి పెట్రోల్ పోసి తగుల బెట్టిన భర్త
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఇక ప్రధాన నిందితుడు సకారియాను న్యాయస్థానం ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీంతో అతడి నుంచి అనేక విషయాలను పోలీసులు రాబడుతున్నారు. గత బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో రేఖా గుప్తాపై సకారియా దాడి చేశాడు. అయితే నిందితుడి వెనుక సయ్యద్ హస్తం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడికి సయ్యద్ రూ.2,000 పంపినట్లుగా కనుగొన్నారు. అంత మాత్రమే కాకుండా నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నట్లుగా గుర్తించారు. సకారియా వృత్తిరీత్యా ఆటోరిక్షా డ్రైవర్. 2017 నుంచి 2024 వరకు రాజ్‌కోట్‌లోని భక్తినగర్ పోలీస్ స్టేషన్లో ఐదు దాడి కేసులు, మద్యం కేసులతో పాటు పలు కేసులు ఉన్నాయి. గుజరాత్ నిషేధ చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద 2017, 2020, 2022లో రెండు సార్లు చర్యలు కూడా తీసుకున్నారు. 2021లో బాంబే పోలీస్ చట్టంలోని సెక్షన్ 56 కింద సకారియాను బహిష్కరించారు.
ఇది కూడా చదవండి: J.D. Vance: ‘రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ భారత్ పై సెకండరీ టారిఫ్ లను విధించారు’.. జెడి వాన్స్ సంచలన వ్యాఖ్యలు
ఇక 2017లో సకారియా ఒక వ్యక్తి తలపై బ్యాట్‌తో కొట్టాడు. అంతేకాకుండా 2022లో భార్యతో గొడవ పడి కుటుంబ సభ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఆ సమయంలో బ్లేడ్‌తో తన తలపై దాడి చేసుకోవడంతో తొమ్మిది కుట్లు పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు మొబైల్లోని సమాచారం, అతడి స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు.
అవినీతి అంశంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన చేసినట్లే వీధి కుక్కలను తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిరసన చేపట్టాలని సకారియా యోచిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇక నిందితుడి మొబైల్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? లేదంటే దాచి పెట్టాడా? అన్న విషయాలను లోతుగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..